Ramineni Foundation Award
-
భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ దంపతులకు విశిష్ట పురస్కారం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి పురస్కారాలు అందిస్తున్నట్టు డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్ చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎం.ఎల్లకు విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం, నిమ్స్ ఆస్పత్రి ఎనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాపద్మజ, తెలుగు సినిమా జర్నలిస్ట్ ఎస్వీ రామారావుకు విశేష పురస్కారాలు అందిస్తున్నట్టు వివరించారు. ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గతేడాది ఫౌండేషన్ తరఫున పురస్కారాలను ప్రకటించినా.. కరోనా కారణంగా వాటిని అందజేయలేదన్నారు. ఈ ఏడాది నిర్వహించే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో వాటినీ అందిస్తామని చెప్పారు. నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతలకు విశిష్ట పురస్కారం, సినీ నటుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం, టీవీ యాంకర్ సుమకనకాల, హీలింగ్ హాస్థ హెర్బల్స్‌ప్రైవేట్ æలిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.మస్తాన్‌యాదవ్, షిర్డీలోని ద్వారకామయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బి.శ్రీనివాస్‌కు విశేష పురస్కారాలను గతేడాది ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పురస్కారాలను అందించే తేదీ, వేదిక తదితర వివరాలను త్వరలో తెలియజేస్తామని నాగభూషణం చెప్పారు. -
పుల్లెల గోపిచంద్, నాగ్ అశ్విన్‌లకు విశిష్ట పురస్కారం
అమరావతి : వివిధ రంగాల్లో రాణిస్తూ సమాజానికి విశేష సేవలందిస్తున్న పలువురికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో ఈ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డాక్టర్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ రెడ్డి(మహానటి ఫేం), ప్రముఖ తెలుగు రచయిత చొక్కాపు వెంకటరమణలకు ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యుఎస్ఎ) తరఫున ప్రతి ఏడాది ఈ విశిష్ట, విశేష పురస్కారాలను అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సాక్షి మీడియా గ్రూప్ ఈడీ రామచంద్రమూర్తి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
7న డా.రామినేని ఫౌండేషన్ పురస్కారాలు ప్రదానం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు ఈ నెల 7న మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో అందజేస్తామని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో గురు వారం ఫౌండేషన్ బ్రోచర్‌ను ఆవిష్క రించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు విశిష్ట పురస్కారం, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌రెడ్డి, మెజీషియన్ చొక్కాపు వెంకట రమణకు విశేష పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. -
ఆర్ నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్ అవార్డు
విజయవాడ: ఈ నెల 12న నగరంలో డా. రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, గోవా సీఎం మనోహర్ పారికర్‌లు ముఖ్య అతిథులుగా హజరుకానున్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. ఈ రామినేని విశిష్ట పురస్కారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని వరించింది. అంతేకాక ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సినీ రంగంలో అతను చేసిన కృషికి ఫలితంగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వీరితో పాటు సురభి కళాకారుడు ఆర్. నాగేశ్వరరావుకు కూడా రామినేని పురస్కారం వరించింది. -
అంపశయ్య నవీన్‌కు రామినేని అవార్డు
హన్మకొండ కల్చరల్ : ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ ప్రతిష్ఠాత్మకమైన రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం- 2015కు ఎంపికయ్యారని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ రామినేని ప్రకటించారు. వచ్చే నెల 12న విశాఖపట్నంలో పురస్కార ప్రదా నం ఉంటుందన్నారు. నవీన్ గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, గుర్రం జాషువా అవార్డు, గోపీచంద్ అవార్డులతోపాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారం ప్రకటించడంపట్ల నవీన్ హర్షం వ్యక్తం చేశారు.