అమరావతి : వివిధ రంగాల్లో రాణిస్తూ సమాజానికి విశేష సేవలందిస్తున్న పలువురికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో ఈ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డాక్టర్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ రెడ్డి(మహానటి ఫేం), ప్రముఖ తెలుగు రచయిత చొక్కాపు వెంకటరమణలకు ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యుఎస్ఎ) తరఫున ప్రతి ఏడాది ఈ విశిష్ట, విశేష పురస్కారాలను అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సాక్షి మీడియా గ్రూప్ ఈడీ రామచంద్రమూర్తి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment