ఆర్.నారాయణ మూర్తికి కేటీఆర్‌ ఫోన్‌ | KTR Call To R Narayana Murthy, Assured Him Of His Full Support In Case Of Any Need | Sakshi
Sakshi News home page

ఆర్.నారాయణ మూర్తికి కేటీఆర్‌ ఫోన్‌

Jul 20 2024 2:54 PM | Updated on Jul 20 2024 4:16 PM

KTR Call To R Narayana Murthy

దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందారు. ఈ క్రమంలో నారాయణ మూర్తి స్పందించారు. తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందవద్దంటూ ఇప్పటికే వెల్లడించారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో నారాయణ మూర్తి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఆర్ నారాయణ మూర్తికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌ చేసి పరామర్శించారు. అన్ని విధాలుగా ఆయనకు అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు. ఈ క్రమంలో నారాయణ మూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వైద్యులను అడిగి కేటీఆర్‌ తెలుసుకున్నారు. త్వరలో ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

ఆర్.నారాయణ మూర్తి విప్లవ చిత్రాలను తెరకెక్కించి ప్రజలకు దగ్గరయ్యారు. దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విప్లవ సినిమాలతోపాటు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలను ఆయన తెరకెక్కించారు. అభిమానులతో పీపుల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement