మార్పు రావాలి | R Narayana Murthy New Movie Market lo Prajaswamyam | Sakshi
Sakshi News home page

మార్పు రావాలి

Published Sun, Jun 2 2019 12:47 AM | Last Updated on Sun, Jun 2 2019 12:47 AM

R Narayana Murthy New Movie Market lo Prajaswamyam - Sakshi

ఆర్‌. నారాయణమూర్తి

‘‘మన దేశంలో ఓట్లు అమ్ముడుపోతున్నాయి. పేరుకే ప్రజాస్వామ్యం. పదవుల్లో ఉన్నవారు ప్రజాసేవ గురించి కాకుండా సంపాదనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఈ విషయాలనే ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమాలో చూపించాం’’ అని ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. ఆర్‌. నారాయణమూర్తి నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఓటు హక్కు ఎంతో విలువైనది అంటుంటారు. అలాంటి ఓట్లనే కొంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారు. ఈ అంశాలనే మా చిత్రంలో ప్రస్తావించాం. ప్రజల్ని ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఆడియోకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజాకవులు రాసిన ప్రతి పాటకూ మంచి ఆదరణ లభిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా చెబుతాం’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement