
సాక్షి, పశ్చిమగోదావరి : సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల్ని ప్రాత్సహించలేదు. ఎవరైనా నాయకుడు పార్టీ మారాలని చూస్తే ఆ పార్టీకి, పదవికీ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 54 శాతం రిజర్వేషషన్లు కల్పించిన ఏకైక నాయకుడు సీఎం జగన్. మార్కెట్‌లో ప్రజాస్వామ్యం అనే సినిమాను మీరందరూ చూడండి, ఆదరించండి. చూపించండి.
భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఓటుకు నోటు, రూ.100 కోట్లు పెడితే ఎమ్మెల్యే, 200 కోట్లు పెడితే ఎంపీ టికెట్. ప్రజాస్వామ్యం ధన స్వామ్యం అయిపోయింది. ప్రజాస్వామ్యం సంతలో సరుకైపోయింది. ప్రజాస్వామ్యన్ని పరిరక్షించడం ద్వారా మన అందరి బతుకులు బాగుంటాయి అనేది ఈ చిత్రం. ఇసుక జల సంపద. భారత దేశంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతి సంపద, మూల సంపద అయిన ఇసుకను ఏ వ్యక్తుల చేతుల్లో లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి’అన్నారు. కాగా, నవంబరు 29న మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment