సాక్షి, విశాఖపట్నం: 'స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దేశం అవసరం' అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఆదివారం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సినీ నటుడు నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం భారీ సభ నిర్వహించి డిక్లరేషన్ ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి కోరారు.
ఆ కమిటీ నివేదికను అమలు చేయాలి
స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం చెబుతున్న కారణాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి చెప్పారు. కేంద్రం ప్రజల ఆకాంక్షలను గుర్తించాలన్నారు. ఉక్కు అమ్మకం ప్రజల మనోభావలతో కూడిన అంశం అని తెలిపారు. దస్తూరి కమిటీ నివేదికను కచ్చితంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం అంటే కుట్రలో చిక్కుకున్నట్లే అని అన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రల హక్కు నినాదం తన ఐడెంటిటీని కోల్పోతుందన్నారు. ప్రజాఉదయమం ద్వారానే విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమన్నారు.
చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి)
Comments
Please login to add a commentAdd a comment