
సాక్షి, అనంతపురం న్యూటౌన్: ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి.. ప్యాకేజీకి ఓకే చెప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకోవడం సరికాదన్నారు.
ప్రత్యేక హోదా పోరు చేస్తున్న వైఎస్ జగన్‌మోహనరెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే తొలి ఓటు తానే వేస్తానని, అలాకాకపోతే భూస్థాపితం చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment