ఉత్తమ్కి వివరణ ఇచ్చిన జయసుధ | Jayasudha meeting with uttam kumar reddy | Sakshi
Sakshi News home page

ఉత్తమ్కి వివరణ ఇచ్చిన జయసుధ

Published Tue, Jun 23 2015 10:53 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

ఉత్తమ్కి వివరణ ఇచ్చిన జయసుధ - Sakshi

ఉత్తమ్కి వివరణ ఇచ్చిన జయసుధ

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ టీఆర్ఎస్లో చేరతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ టీఆర్ఎస్లో చేరతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. మంగళవారం ఉదయం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో జయసుధ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న జయసుధ... అందుకు గల కారణాలు ఉత్తమ్కుమార్రెడ్డికి ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం. అయితే జయసుధ కాంగ్రెస్ పార్టీ వీడనున్నారు... అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారంటూ సోమవారం ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఉత్తమ్కుమార్తో జయసుధా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

టీపీసీసీ నేతలు తనను పట్టించుకోవడం లేదని జయసుధ గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.... అందులోభాగంగానే ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని... పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరే ఆలోచనలో జయసుధ ఉన్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆదివారం హైదరాబాద్ జయసుధ తనయుడి సినిమా ఆడియో ఫంక్షన్కు తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. దీంతో జయసుధ పార్టీ మారిపోతారంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత జోరు పెరిగింది. 

దీంతో తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్కలు జయసుధకు ఫోన్ చేశారు.. పార్టీ మారనున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఈ సందర్భంగా ఆమె ఖండించినట్లు తెలిసింది. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ వారితో జయసుధ స్పష్టం చేశారని తెలిసింది. అంతేకాకుండా తన తనయుడు హీరోగా రూపొందిన సినిమాకు సంబంధించిన కార్యక్రమం వల్ల పార్టీ సమావేశంపై దృష్టి కేంద్రీకరించలేపోయానని ఈ సందర్భంగా జానారెడ్డి, ఉత్తమ్, భట్టివిక్రమార్కలకు జయసుధ వివరణ ఇచ్చారని సమాచారం.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కసరత్తులో భాగంగా కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో జానారెడ్డి నేతృత్వంలో, జయసుధ అధ్యక్షతన సోమవారం సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి మరో తేదీ ఖరారు చేయాలని ఈ సందర్భంగా సీనియర్లును జయసుధ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement