'నేను కాంగ్రెస్ లోనే కొనసాగుతా' | i am continuing the congress says actress jayasudha | Sakshi
Sakshi News home page

'నేను కాంగ్రెస్ లోనే కొనసాగుతా'

Published Tue, Jun 23 2015 11:36 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

'నేను కాంగ్రెస్ లోనే కొనసాగుతా' - Sakshi

'నేను కాంగ్రెస్ లోనే కొనసాగుతా'

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సినీనటి జయసుధ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. పార్టీకి కొత్తకాలంగా దూరంగా ఉండటంపై జయసుధ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ సినీనటిని కాబట్టి తన సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడుకోవాలన్నారు. మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని జయసుధ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. కాగా జయసుధ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఊహాగానాలు రేగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement