
'జయసుధ చేరికపై చర్చించలేదు'
సినీ నటి జయసుధను తమ పార్టీలో చేర్చుకునే అంశంపై చర్చ జరలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గౌరవం మంటగలిపే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. టీడీపీ వైఖరితో రెండు రాష్ట్రాల ప్రజలు తలదించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ఏపీ ప్రజలకు సైతం టీడీపీ న్యాయం చేయడం లేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లే పరిస్థితిలో ఉన్న తమ అధినేతను కాపాడుకునేందుకు తెలంగాణ టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సినీ నటి జయసుధను తమ పార్టీలో చేర్చుకునే అంశంపై చర్చ జరలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.