cash for votes
-
మహారాష్ట్రలో క్యాష్ ఫర్ ఓట్స్ ఆరోపణలు
-
ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా
న్యూఢిల్లీ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంలో విచారణ జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలెం మత్తయ్యను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు కోసం రెండు వారాల గడువు ఇస్తూ, అప్పటివరకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. -
సుప్రీంలో సవాలు చేస్తాం: ఆర్కే
-
సుప్రీంలో సవాలు చేస్తాం: ఆర్కే
కేసులు కొట్టించేసుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. ఆడియోటేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని తాము శాస్త్రీయంగా నిరూపించినా కేసును కొట్టేశారని, ఇక ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసు విషయంలో లోకస్ స్టాండీ మీద కూడా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇంతకుముందు పీవీ నరసింహారావు, జయలలిత లాంటి చాలామంది పెద్దలు క్వాష్ పిటిషన్లు దాఖలు చేయలేదని, ఎలాంటి తప్పు చేయలేదన్న నమ్మకం చంద్రబాబుకు ఉంటే ఆయన ఎందుకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు మీద విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో ఒకప్పుడు పీవీ నరసింహారావు కూడా శిక్ష అనుభవించారని, కానీ ఇప్పుడు మాత్రం ఓటుకు నోటు ఇచ్చి కొన్నా అది అవినీతి కిందకు రాదని తీర్పులో ఉటంకించారని చెప్పారు. కేసు దాఖలు చేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి లోకస్ స్టాండీ లేదని కోర్టు చెప్పిందని తెలిపారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరైనా కోర్టు దృష్టికి తెచ్చి ప్రైవేటు కేసు దాఖలు చేయవచ్చని ఇంతకుముందు కొన్ని కేసుల్లో చెప్పారని అన్నారు. ఏసీబీ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదని, రెండేళ్ల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టే తాము కేసు దాఖలుచేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. -
ముగిసిన శ్రీనివాస్ నాయుడి విచారణ
-
ముగిసిన శ్రీనివాస్ నాయుడి విచారణ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడ్ని మంగళవారం ఏసీబీ విచారించింది. ఆరు గంటలపాటు శ్రీనివాస్ నాయుడ్ని ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు విచారణ ముగిసిన అనంతరం శ్రీనివాస్ నాయుడు మీడియాకు తెలిపాడు. శ్రీనివాస్ నాయుడి విచారణలో భాగంగా ఈరోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో 160సీఆర్సీసీ కింద సోమవారం శ్రీనివాస్ నాయుడుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. -
'సీబీఐ విచారణ ఒక్కటే పరిష్కార మార్గం'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే పరిష్కార మార్గమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు చార్జిషీట్ లో 22 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడం తీవ్రమైన అంశంగానే పరిగణించవచ్చన్నారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణ కోసం కేంద్రాన్ని కోరాలని ఆయన పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై రెండు రాష్ట్రాల సీఎంలు నిజాయితీగా వ్యవహరిస్తారన్నవిశ్వాసం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓటుకు కోట్లు కేసులో విచారన కోసం కేంద్రాన్ని అడగక తప్పదని రఘువీరా పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి నష్టం జరింగదని కాంగ్రెస్ ను తిడుతూ కాలయాపన చేస్తే ప్రజలు హర్షించరన్నారు. ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుని రావాలన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్, విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడటాన్ని చూస్తే.. కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదనే విషయం రుజువుతోందన్నారు. కడపలో మంత్రి నారాయణకు చెందిన కాలేజీలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రఘువీరా ప్రశ్నించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. ఇలాంటి కేసులను మూడు నెలల్లో తేల్చేలాగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడిన వారిని ఉరితీయాలన్నారు. ప్రధాని బీహార్ ప్రకటించిన ప్యాకేజీని ఎవరూ నమ్మరని , అది ఎన్నికల డ్రామా అని రఘువీరా పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే బీహార్ ప్యాకేజీ అమలవుతుందని ఆశించవచ్చన్నారు. -
'జయసుధ చేరికపై చర్చించలేదు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గౌరవం మంటగలిపే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. టీడీపీ వైఖరితో రెండు రాష్ట్రాల ప్రజలు తలదించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ఏపీ ప్రజలకు సైతం టీడీపీ న్యాయం చేయడం లేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లే పరిస్థితిలో ఉన్న తమ అధినేతను కాపాడుకునేందుకు తెలంగాణ టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సినీ నటి జయసుధను తమ పార్టీలో చేర్చుకునే అంశంపై చర్చ జరలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఏపీలోనూ ఓట్లకు కోట్లు ఎర!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రలోభాలకు పాల్పడుతోంది. ఓట్లకు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రకాశం, కర్నూలు జిల్లాలలో తగిన బలం లేకపోయినా టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ రెండు చోట్లా కచ్చితంగా గెలవాలని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. ఏపీలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం నాటితో ముగిసింది. టీడీపీ 9, వైఎస్ఆర్ సీపీ ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకుంది. మరో రెండు స్థానాలకు మాత్రం పోటీ ఉండటంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాలలో జూలై 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు జిల్లాల్లో టీడీపీ గెలవడానికి బలం లేకపోయినా స్థానిక ప్రజాప్రతినిధులకు ఎర వేస్తోంది. డబ్బులు ఆశ చూపడం, వినని వారిపై కేసులు పెడతామంటూ బెదిరింపు చర్చలకు పాల్పడుతున్నారు. ఎలాగైనా మండలిలో బలం పెంచుకోవాలని చూస్తున్న చంద్రబాబు, ఇక్కడ కూడా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహా పాచికలు విసురుతున్నారని అంటున్నారు.