టుకు కోట్లు కేసులో మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడ్ని మంగళవారం ఏసీబీ విచారించింది.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడ్ని మంగళవారం ఏసీబీ విచారించింది. ఆరు గంటలపాటు శ్రీనివాస్ నాయుడ్ని ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు విచారణ ముగిసిన అనంతరం శ్రీనివాస్ నాయుడు మీడియాకు తెలిపాడు.
శ్రీనివాస్ నాయుడి విచారణలో భాగంగా ఈరోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో 160సీఆర్సీసీ కింద సోమవారం శ్రీనివాస్ నాయుడుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చింది.