రాజేంద్రప్రసాద్ ఒంటరయ్యారు! | maa president elections: Rajendra Prasad shocks to vice president panel | Sakshi
Sakshi News home page

రాజేంద్రప్రసాద్ ఒంటరయ్యారు!

Published Wed, Mar 25 2015 1:40 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

రాజేంద్రప్రసాద్ ఒంటరయ్యారు! - Sakshi

రాజేంద్రప్రసాద్ ఒంటరయ్యారు!

హైదరాబాద్ :  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన సినీనటుడు రాజేంద్రప్రసాద్ 'ఆ నలుగురు' లేక ఒంటరయ్యారు. ఎన్నికకు ముందే ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాంతో మా అధ్యక్ష ఎన్నిక వన్సైడ్ వార్గా మారింది. ఉపాధ్యక్ష పదవికి  అభ్యర్థులు లేక రాజేంద్ర ప్రసాద్ షాక్ తిన్నారు. కాగా అనూహ్య పరిణామాల మధ్య రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ నుంచి శివాజీ రాజా, ఉత్తేజ్ హఠాత్తుగా తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజేంద్ర ప్రసాద్కు చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రమే ఇప్పటివరకూ మద్దతు ప్రకటించారు.

ఈ నెల 29న జరగనున్న 'మా' అధ్యక్ష పదవికి జయసుధ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతు పలికారు. ఆయన మద్దతుతో జయసుధ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా జయసుధకే మద్దతు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement