
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్ జగన్‌కు అందించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.