marriage invitation
-
వైభవంగా 'జక్కంపూడి వారి పెళ్లి సందడి..' ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం!
సాక్షి, తూర్పుగోదావరి: స్థానిక శాసనసభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోదరుడు, వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్ దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్లో అంగరంగ వైభవంగా జరిగింది. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావుకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అభిమానమంతా ఉవ్వెత్తున ఎగసివచ్చిందా అన్నట్టుగా అభిమాన గణం భారీఎత్తున తరలివచ్చి, ఆయన ద్వితీయ కుమారుడైన గణేష్ దంపతులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా దివాన్‌చెరువుకు హెలికాప్టర్లో వచ్చి, నూతన వధూవరులైన జక్కంపూడి గణేష్, సుకీర్తిలను ఆశీర్వదించి, కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ సమయంలో కొంతమంది సీఎంతో సెల్ఫీలకు రిక్వెస్టు చేయడంతో అందుకు ఆయన చిరునవ్వుతో వారికి అవకాశం ఇచ్చారు. కుటుంబ సభ్యులే కాకుండా బంధువర్గంలోని వారు, అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో.. ఆహ్వానితులలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో సినిమా సెట్టింగ్‌లను తలపించేలా చేసిన ఏర్పాట్లు అందరినీ అబ్బురపరిచాయి. వివాహ రిసెప్షన్ వేదికపై యశస్వి కొండేపూడి మ్యూజిక్ బ్యాండ్ లైవ్‌తోపాటు సింగర్ శిల్ప, యాంకర్ దీప్తి నల్లమోతు, మిమిక్రీ రాజు, గోవింద్ డ్యాన్స్ టీమ్ లైవ్ ప్రోగ్రామ్స్ అలరించాయి. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, రంగుల రాట్నం, ‘పెట్టా తులాల్’ కేరళ నృత్యం, ప్రకృతి ఒడిలోకి వచ్చామా అనే రీతిలో ఆసక్తి ఉన్నవారు ఫొటో షూట్లు తీసుకునేలా వేసిన సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక భోజన సదుపాయాల గురించి ప్రస్తావిస్తే .. ‘ఆహా .. ఏమి రుచి, తినరా మైమరిచి..’ అనేవిధంగా 24 రకాల వంటకాలతో ఆహార ప్రియుల మదిని దోచారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం.. జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కి గురువారం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా హెలికాప్టర్లో దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్లోని హెలిపాడ్‌పై దిగిన ఆయనకు ఆహ్వాన కర్త, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన తల్లి జక్కంపూడి విజయలక్ష్మితో పాటు మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, తానేటి వనిత, ఆర్కే రోజా, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, రాజంపేట ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆహ్వానం పలికారు. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, అనంతబాబు, వంక రవీంద్రనాఽథ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, తలారి వెంకట్రావు, కొండేటి చిట్టిబాబు, జె.శ్రీనివాస్‌నాయుడు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. సినీ ప్రముఖులు రామ్‌గోపాల్‌వర్మ, సుమన్, హీరో విశ్వక్‌సేన్‌లు గణేష్, సుకీర్తిలకు ఆశీస్సులు అందజేశారు. -
పెళ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్.. కార్డులిచ్చే రోజులు పోయాయి..
సాక్షి వరంగల్: మా ఇంట్లో పెళ్లికి రండి.. అంటూ ఆప్యాయమైన పెళ్లి పత్రిక పలకరింపు మారింది. ఒకప్పుడు మేళతాళాలతో బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. బొట్టు పెట్టి మరీ పత్రిక చేతికిచ్చి ఆహ్వానించేవారు. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టు పెట్టి.. పెళ్లి కార్డు తలుపునకు పెట్టేవారు. దూరంగా ఉన్న ఊళ్లకు ప్రింట్ చేయించిన కార్డులను ఇంటి.. నాయీబ్రాహ్మణుడు లేదా రజకులకు ఇచ్చి పంపిణీ చేయించేవారు. ఈ ఆనవాయితీ కొన్ని పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా.. మారుతున్న కాలం.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నామమాత్రంగా 200 కార్డులు.. అంతకన్నా కొంచెం ఎక్కువ.. తక్కువగా ప్రింట్ చేయించడం.. సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల గ్రూపు తయారు చేసి అందులో కార్డు పెట్టి పిలిచే విధానానికొచ్చింది. వాట్సాప్‌లో కార్డు పెడుతున్నారు. కొందరికి ఫోన్ చేసి పెళ్లికి రండి అని సెలవిస్తున్నారు. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్. మన పెళ్లి పిలుపులు ప్రస్తుతం ఎలా మారాయో చూద్దాం.. పెళ్లికార్డు.. పిలుపు ఇలా.. నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై ఓరచూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. పెళ్లి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కాకుండా.. ఫొటోసూ్టడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. తాజాగా ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్లో పెళ్లి పత్రికను(పెళ్లి ఫైల్ అనాలి మరి..) ఓపెన్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక వివరాలతో చివరగా ‘డేట్ సేవ్ చేసుకోండి’ అని వీడియో ప్లే అవుతోంది. వాట్సాప్ గ్రూప్ కాల్ చేసి.. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నాం.. అంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది. వాట్సాప్ గ్రూపులో పెళ్లి సందడి.. బ్రాహ్మణుడు లగ్న పత్రిక రాసింది మొదలు.. పెళ్లి సందడి షురువైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెళ్లి తేదీ, సమయం, వేదిక మొదలు అన్నింటినీ తెలిపే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్.. పెళ్లి జరుగుతున్న వారి ఇంటి పేరుతో క్రియేట్ చేస్తారు. అందులో దగ్గరి, దూరపు బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లన్నీ చేర్చి.. వేడుకలు షురువైనప్పటి నుంచి ఆ ఫొటోలను అందులో అప్లోడ్ చేయడం.. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లయింది. ఆ ఫొటోలు చూసిన గ్రూపులోని వారు సైతం మరీ గుర్తు చేసుకుని తాము కూడా పెళ్లికి వెళ్లాలనే ఆతృత వారిలో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 200 కార్డులే.. కరోనా ముందు వరకు ఓ ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు వెయ్యి కార్డుల వరకు ఆహ్వాన పత్రికలు ఆర్డర్ ఇచ్చేవారు. ఇప్పుడు 200 వరకు ప్రింట్ చేయించుకుంటున్నారు. అవి కూడా లేటెస్ట్ డిజైన్లు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే.. డిజైన్ చేసిన పెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు ప్రోమో వీడియోలను వాట్సాప్ ద్వారానే పంపిస్తున్నారు. దీంతో కార్డుల ప్రింటింగ్ తగ్గించారు. – బోడకుంట్ల సంపత్, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, వరంగల్ సైకిల్‌పై వెళ్లి ఇచ్చాం.. మా నాన్న వాళ్లు సైకిళ్లపై.. దూరమైతే బస్సుల్లో వెళ్లి పెళ్లి కార్డులు ఇచ్చి వచ్చేవాళ్లు. ఎడ్ల బండిపై కూడా వెళ్లి పంచేవాళ్లు. కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చిన సందర్భాలున్నాయి. అదే ఇప్పుడైతే గ్రామం వరకే పరిమితమైంది. కొందరికి పెళ్లి కార్డులు లేదంటే ఇంటింటికి వెళ్లి చెప్పి వస్తున్నాం. పెళ్లింటి వారే వాట్సాప్‌లలో కార్డులు పంపుతున్నారు. – పంతంగి రజనీకాంత్, రజక కులపెద్ద, ధర్మారావుపేట ఒత్తిడిలో మరిచినా.. క్షణాల్లో చేరవేత.. పెళ్లి పనులన్నీ ఒక ఎత్తయితే.. కార్డుల పంపిణీ అనేది కత్తిమీద సాముతో కూడుకున్న పని. అయినా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి పెళ్లి పత్రికలు ఇవ్వడం.. పెళ్లి పనుల ఒత్తిడిలో పడి కొందరికి కార్డులు ఇవ్వడం కూడా మరిచిపోతుంటాం. అందుకే.. వాట్సాప్ ద్వారానే ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డులు పంపించాం. వీడియో ప్రోమోలు కూడా సెండ్ చేశాం. సెకన్ల వ్యవధిలోనే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించగలిగాం. గతంలో పెళ్లి కార్డుల పంపిణీకి నెలరోజుల ముందు నుంచే బాగా కసరత్తు చేసేవాళ్లం. ఇప్పుడు కాస్త సులువైంది. – గంగధార మురళి, తండ్రి నెలరోజుల ముందు నుంచే.. గతంలో నెల రోజుల ముందే పెళ్లి కార్డులు మాకు ఇచ్చేవారు.. రజక, నాయీబ్రాహ్మణుల సహాయంతో తమ బంధువులు ఉండే ఊర్లకు పంపించి పెళ్లి కార్డులు ఇచ్చేలా చూశాం. వారికి తలా కొన్ని కార్డులు ఇచ్చి ఏ ఊరికి పోవాలో చెప్పేవాళ్లం. కొన్ని సందర్భాల్లో కార్డు తీసుకునేవారు ఇంటి వద్ద లేకపోతే పక్క ఇంటివారికి ఇచ్చి మళ్లీ వచ్చాక ఇవ్వమని చెప్పిన సందర్భాలున్నాయి. సొంత ఊరిలో కుల బంధువుల ఇంటికి వెళ్లి వారి దర్వాజకు బొట్టు పెట్టి, ఆ ఇంట్లో వారికి కూడా బొట్టు పెట్టి పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించాం. ఇప్పటికీ ఊళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ నోటిమాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. ఏదో వాట్సాప్ అంట.. అందులో కార్డులు పంపిస్తుండ్రు. – కె.లచ్చమ్మ, బంధనంపల్లి, రాయపర్తి మండలం -
వినూత్న ‘పెండ్లిపత్రిక’.. పారేయకండి.. మట్టిలో పాతిపెడితే..
సాక్షి, నిర్మల్: పెళ్లిపత్రిక.. ఆ పెళ్లి తేదీ, వివాహ వేదిక చూస్తే చాలు.. మళ్లీ దాన్ని ఎక్కడో పడేస్తాం. కొన్నిసార్లు సదరు పెళ్లి కాకముందే చెత్తబుట్టల్లోకి చేరిపోతుంటాయి. అలా.. కాకుండా మట్టిలో చేరి, మొక్కగా ఎదిగి, తమను ఆశీర్వదించిన వారింట పచ్చదనం నిండేలా పత్రిక ఉండాలనుకున్నారు. ఆ దిశగా.. ప్రయత్నం చేసి అనుకున్నది సాధించారు. వినూత్నంగా పర్యావరణ పెళ్లిపత్రికను రూపొందించి, బంధుమిత్రులనే కాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అల్లం వనమాల, దేవీదాస్ దంపతుల కుమారుడు ప్రవీణ్ హైదరాబాద్‌లో మెడికల్‌షాప్ నిర్వహిస్తుంటాడు. ఈనెల 27న ఆయన పెళ్లి ఉంది. ఇందుకు వినూత్నంగా ఆహ్వానం పలకాలని, తామిచ్చే పత్రిక ఉత్తగా చెత్తలోకి వెళ్లకుండా ఉపయోగపడాలని భావించారు. బంతి, తులసి, గులాబీ, పాలకూర విత్తనాలతో ప్రత్యేకంగా పెళ్లిపత్రికను తయారు చేయించారు. చదవండి: కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: హరీష్ రావు ఏంచేయాలో.. తమ పెళ్లి తర్వాత తామిచ్చిన పత్రికను పారేయకుండా.. ఓ గంట నీటిలో నానబెట్టి, పూలకుండీలో పెట్టాలని ప్రవీణ్ చెబుతున్నారు. అలా మట్టిలో కలిసిన తర్వాత ఆ పత్రికలో ఉన్న విత్తనాల నుంచి మొలకలు వస్తాయని, వాటికి నిత్యం నీటిని పోస్తే మొక్కలుగా ఎదుగుతాయని వివరిస్తున్నారు. ఈ విధానాన్ని పత్రిక కింది భాగంలో ముద్రించారు. కోయంబత్తూరు నుంచి.. ఈ పర్యావరణ పత్రికను ఆన్లైన్లో చూశామని, తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించామని చెప్పారు. ఒక్కో పత్రికకు రూ.50వరకు ఖర్చు అయిందన్నారు. పర్యావరణ హితమైన ఈ పత్రిక కవర్‌పైన దేశనాయకులైన వివేకానంద, శివాజీ, భగత్‌సింగ్, కుమ్రంభీమ్ తదితరుల ఫొటోలను ముద్రించడం వల్ల తమ దేశభక్తినీ ప్రవీణ్ చాటుకున్నారు. చదవండి: రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జయసుధ
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జయసుధ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్ జగన్‌కు అందించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. (చదవండి : చిన్నారి ప్రసంగంపై సీఎం జగన్ అభినందనలు) -
కేసీఆర్‌ను కలిసిన అజారుద్ధీన్ సానీయా మీర్జా
-
కూతురు పెళ్లి; అమితానందంలో కుటుంబం!
చెన్నై : ఇంట్లో వివాహం వంటి శుభకార్యం జరిగితే ఇళ్లంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. బంధువులతో పెళ్లింట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఓ కుటుంబానికి తమ ఇంట్లో వివాహం జరుగుతుందనే ఆనందం కంటే అత్యున్నత పదవిలోని వ్యక్తి పంపిన సందేశం వారిని ఉద్వేగానికి లోనుచేసింది. వివరాలు.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన రాజశేఖరన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన కూతురు వివాహాన్ని సెప్టెంబర్ 11న నిశ్చయించాడు. పెళ్లికి బంధువులు, తెలిసిన వాళ్లతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆహ్వనించాడు. ఇందులో భాగంగా ప్రధానికి లేఖ రాశాడు. తరువాత కుటుంబం పెళ్లి పనుల్లో మునిగిపోయిన కుటుంబం ఈ విషయం గురించి మరిచిపోయింది. అయితే గత శనివారం ప్రధాని నుంచి కుటుంబానికి ఓ లేఖ అందింది. అది చదివిన కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయారు. ప్రధాని పంపిన లేఖలో ‘‘మీ కుమార్తె వివాహం గురించి నాకు తెలియపరచడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ ఇంట్లో జరిగే శుభ సందర్భానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నూతన వధువరులకు నా శుభాకాంక్షలు, నవ జంట ఎల్లప్పుడు శ్రేయస్సు, ఆనందాలతో జీవించాలి’’ అని ప్రధాని లేఖలో ఆశీర్వదించారు. ఏకంగా ప్రధాని నుంచి వధూవరులను ఆశీర్వదిస్తూ లేఖ రావడంతో రాజశేఖరన్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. ప్రధాని పంపించిన లేఖను ఫ్రేమ్ కట్టించాలని నిర్ణయించుకున్నట్లు సదరు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వైరలవుతున్న పెళ్లి పత్రిక....
యూపీ, ఫజియాబాద్ : భారతఖండం...‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ ప్రదర్శిస్తుంది. అనాదిగా ఈ భరతభూమిలో మతసామరస్యం వెల్లివిరుస్తుంది. ఇక్కడ హిందూ, ముస్లింలు భాయ్..భాయ్. ఇందుకు నిదర్శంగా ఓ అరుదైన సంఘటన వెలుగు చూసింది. ఓ ముస్లిం సొదరుడు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో సీతారాముల చిత్రాన్ని ముద్రించి మరోమారు హిందూ, ముస్లింలు అన్నదమ్ములనే భావాన్ని ప్రచారం చేశాడు. వివారాల్లోకి వెళ్తే యూపీ ఫజియాబాద్లోని సుల్తాన్పూర్ జిల్లా బాగ్సరాయ్ గ్రామానికి చెందిన మహ్మద్ సలీమ్ కుమార్తె జహన బానోకు వివాహం నిశ్చయమైంది. భారతీయ మతసామరస్యానికి ప్రతీకగా తన కూతురు వివాహ వేడుక జరగాలని సలీమ్ భావించాడు. అందుకే పెళ్లి పత్రికను హిందూ సంప్రదాయం ప్రకారం ముద్రించాడు. ఈ పత్రికలో సీతారాములు పవిత్ర అగ్నిహోమం ముందు నిలబడి ఉన్న ఫోటోను ముద్రించారు. అంతేకాకుండా పూజ సామాగ్రి అయిన కలశం, దీపాలు, అరటి ఆకులతోపాటు పవిత్ర మంగళసూత్రం, కొబ్బరికాయ, పూలు, పండ్లు వంటి అంశాలకు సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. అంతేకాక ఈ ఆహ్వాన పత్రిక చేతితో రాసి ఉన్నట్లు ఉండటం మరో విశేషం. సలీమ్ ఈ పత్రికను తన హిందూ స్నేహితులకు ఇచ్చినప్పుడు వారు చాలా ఆశ్చర్యపోయారని తెలిపాడు సలీమ్. అలానే తన ముసల్మాను బంధువులకు ఇచ్చినప్పుడు వారు ఆనందంగా దీన్ని స్వీకరించడమే కాక తన ప్రయత్నాన్ని అభినందించారని తెలిపాడు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని సలీమ్‌ను అడగ్గా ‘హిందూ, ముస్లింల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించాలనుకున్నాను, అందుకే నా కుమార్తె పెళ్లి పత్రికను హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రూపొందించాను. హిందూ సోదరుల మత విశ్వాసాలను, వారు కొలిచే దేవతామూర్తులను గౌరవిస్తే వారు కూడా మనస్పూర్తిగా ముస్లిం మతాన్ని గౌరవిస్తారని’ తెలిపాడు. సలీమ్ పక్కంటి వ్యక్తి రాధే శ్యామ్ ‘సలీం తన కూతురు వివాహ ఆహ్వాన పత్రికలో సీతారాముల బొమ్మను ముద్రించి హిందూ మతం పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేసాడు. అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే అతడు చేసిన పనిని ఏ ఒక్క ముసల్మాను కూడా వ్యతిరికించలేదు. ఇది నిజంగా అభినందనీయం’ అన్నారు. -
పవన్‌ను కలిసిన కేంద్ర మంత్రి
హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో కలిశారు. కాటమరాయుడు షూటింగ్లో బిజీగా ఉన్న పవన్‌ను కలిసిన దత్తాత్రేయ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. పవన్‌ను ఆహ్వానించేందుకు దత్తాత్రేయ వెంట బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. -
యువరాజు వివాహానికి ప్రముఖలకు ఆహ్వానం
మైసూరు: మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ్ ఒడయార్, త్రిషికా కుమారిల వివాహానికి సంబంధించి వివాహ ఆహ్వాన పత్రికలను అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైసూరు రాజవంశస్థుల సంప్రదాయం ప్రకారం గండభేరుండం, ప్యాలెస్ చిహ్నలతో కూడిన ఆహ్వాన పత్రికలను ముద్రించారు. మొత్తం ఐదు రకాల ఆహ్వాన పత్రికల ముద్రణకు ఆమోదం తెలిపిన రాజమాత ప్రమోదా దేవి ఒడయార్ గత వారం శృంగేరి మఠానికి చేరుకొని మఠం పీఠాధిపతి, రాజగురవు శ్రీ భారతీతీర్థ స్వాముల ఆశీర్వాదం పొందిన అనంతరం లగ్న పత్రికకు పూజలు చేయించారు. ఇప్పటికే బీజేపీ పార్టీలో గుర్తింపు యదువీర్ ఒడయార్‌కు కాబోయే మామ హర్షవర్థన్(త్రిషికా కుమారి తండ్రి) బంగారు లేపనంతో చేయించిన ఆహ్వాన పత్రికను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికే అందజేశారు. కేంద్ర మంత్రివర్గంలోని ప్రముఖులకు,ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే,మాజీ ప్రధాని హెచ్.డీ.దేవెగౌడ తదితర రాష్ట్ర ప్రముఖ రాజకీయ,సినీ,క్రీడాకారులకు ఆహ్వాన పత్రికలను అందచేసారు.