యువరాజు వివాహానికి ప్రముఖలకు ఆహ్వానం
మైసూరు: మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ్ ఒడయార్, త్రిషికా కుమారిల వివాహానికి సంబంధించి వివాహ ఆహ్వాన పత్రికలను అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైసూరు రాజవంశస్థుల సంప్రదాయం ప్రకారం గండభేరుండం, ప్యాలెస్ చిహ్నలతో కూడిన ఆహ్వాన పత్రికలను ముద్రించారు.
మొత్తం ఐదు రకాల ఆహ్వాన పత్రికల ముద్రణకు ఆమోదం తెలిపిన రాజమాత ప్రమోదా దేవి ఒడయార్ గత వారం శృంగేరి మఠానికి చేరుకొని మఠం పీఠాధిపతి, రాజగురవు శ్రీ భారతీతీర్థ స్వాముల ఆశీర్వాదం పొందిన అనంతరం లగ్న పత్రికకు పూజలు చేయించారు. ఇప్పటికే బీజేపీ పార్టీలో గుర్తింపు యదువీర్ ఒడయార్‌కు కాబోయే మామ హర్షవర్థన్(త్రిషికా కుమారి తండ్రి) బంగారు లేపనంతో చేయించిన ఆహ్వాన పత్రికను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికే అందజేశారు.
కేంద్ర మంత్రివర్గంలోని ప్రముఖులకు,ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే,మాజీ ప్రధాని హెచ్.డీ.దేవెగౌడ తదితర రాష్ట్ర ప్రముఖ రాజకీయ,సినీ,క్రీడాకారులకు ఆహ్వాన పత్రికలను అందచేసారు.