
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. మూడు ప్రతిష్టాత‍్మక నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమాలో మహేష్ తల్లి పాత్రపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయప్రధ నటించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం నటి జయసుధ తాజా ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చారు. మహర్షి సినిమాతో తాను మహేష్‌కు తల్లిగా నటిస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో మహర్షి సినిమాలో తల్లి పాత్రలో కనిపించబోయేది జయప్రధ కాదు జయసుధ అని కన్ఫామ్ అయిపోయింది.