మరో మల్టీ స్టారర్లో మహేష్...?
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. మురుగదాస్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. అశ్వనిదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న సినిమా మల్టీ స్టారర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించాడు మహేష్. ఈ సారి ఓ యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడట. వంశీ డైరెక్ట్ చేయబోయే సినిమాలో మహేష్ బాబుతో పాటు కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఇప్పుడే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించటం లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.