Actress Jayasudha Sensational Comments On Tollywood - Sakshi
Sakshi News home page

Jayasudha: వారి కుక్కలకు కూడా స్పెషల్‌ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్‌ కామెంట్స్‌

Published Sat, Jul 30 2022 12:59 PM | Last Updated on Sat, Jul 30 2022 3:55 PM

Actress Jayasudha Sensational Comments On Tollywood In Latest Interview - Sakshi

పద్నాగేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. ఆమె ఇండస్ట్రీకి  వచ్చిన 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 50 ఏళ్లకు సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్‌’  తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇక ఆమె సినిమాలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు.

చదవండి: ‘బింబిసార’ ఈవెంట్‌లో విషాదం, ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ అనుమానాస్పద మృతి

ఈ సందర్భంగా టాలీవుడ్‌లో హీరోహీరో​యిన్ల మధ్య వివక్ష ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగు హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని, అదే బాలీవుడ్‌ నుంచి ఏ హీరోహీరోయిన్‌ వచ్చిన వారికి చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తారన్నారు. స్టార్‌ హీరోయిన్‌ అయిన తనకు కూడా ఇక్కడ అవమానాలు తప్పలేదన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నటిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని, ఇన్నేళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే సన్మానాలు కనీసం ఫ్లవర్ బొకే అయినా పంపించేవారన్నారు. కానీ, ఇక్కడ అది కూడా ఉండదని విమర్శించారు.  ‘బాగా సక్సెస్‌ అయిన పెద్ద హీరోలను ఒకలా, చిన్న హీరోలను ఒకలా చూస్తారు.

చదవండి: గ్లామర్‌ డోస్‌ పెంచిన నో ఆఫర్స్‌.. మరి ఇకనైనా..

ఇక్కడి హీరోయిన్లను మాత్రం మరి చిన్నచూపు చూస్తారు. అదే ముంబై నుంచి ఏ హీరోహీరోయిన్‌ వచ్చినా వారి కుక్కపిల్లకు కూడా స్పెషల్‌ రూం ఇస్తారు’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.  అయితే హీరోలు కూడా ఇలానే ఉంటారా? అని ప్రశ్నించగా.. వాళ్లది ఏం ఉండదని, పక్కన ఉండేవాల్లే ఎక్కువ చేస్తుంటారని ఆమె అన్నారు. అనంతరం ఒకవేళ పెద్ద హీరో డాన్స్‌ సరిగ చేయలేకపోతే.. హీరోయిన్ల దగ్గరికి వచ్చి ఏంటీ మీరు మూమెంట్‌ సరిగా చేయడలేదంటారని పేర్కొన్నారు. స్టార్‌ హీరోయిన్‌  చివరగా పద్మశ్రీకి బాలీవుడ్‌ హీరోయిన్లు మాత్రమే అర్హులా.. తెలుగు హీరోయిన్లకు ఆ అర్హత ఉండదా? అని ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం జయసుధ కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement