'రికార్డ్ బ్రేక్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నిహార్ కపూర్ మీడియాతో ముచ్చటించాడు. తన కొత్త మూవీ గురించి పలు విషయాల‍్ని పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)
'రికార్డ్ బ్రేక్' కథ వినగానే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించి చేస్తానని అన్నాను. హీరో అని కాకుండా క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఈ మూవీ చేశాను. కథ విషయానికొస్తే.. అడవిలో పెరిగిన ఇద్దరు కవల అనాథలు.. కుస్తీ నేర్చుకుని సిటీకి వచ్చి, ఇంటర్నేషనల్ లెవెల్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ వరకు వెళ్లే ప్రయాణాన్ని చాలా బాగా చూపించారు. ఇది తెలుగు సినిమా అయినాకానీ ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం.
సినిమాని అమ్మ(జయసుధ) కొంత చూశారు. ఆమె దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ ఒకసారి ఫుల్ సినిమా చూసిన తర్వాత ఏం చెప్తారు అనేది నేను వెయిట్ చేస్తున్నాను. కథ నేనే విని ఒకే చేశా. అయితే యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నావ్ అని చెప్పి అమ్మ నన్ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నా, భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. ఇప్పుడైతే కొన్ని స్క్రిప్ట్స్ రాస్తున్నాను.
(ఇదీ చదవండి: 20 ఏళ్ల తర్వాత కలిసిన 'మన్మథుడు' జోడీ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment