సీనియర్ హీరోయిన్ జయసుధ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 1990లోనే అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తనదైన నటనతో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించిన జయసుధ మాతృభాష తెలుగే. జయసుధ దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లోను నటించారు. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. ఆమె ఎక్కువగా రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు చిత్రాల్లో కనిపించారు. ఈ ఏడాది వారసుడు, మళ్లీ పెళ్లి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో నటించారు.
(ఇది చదవండి: పెళ్లై కొన్ని నెలలైనా కాలేదు.. అప్పుడే విడాకులా..!)
తెలుగులో స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగిన జయసుధకు ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె కూడా నటి అన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమెకు జయసుధలా వెండితెరపై అంతలా రాణించలేకపోయింది. జయసుధ సోదరి సుభాషిణి మొదట బుల్లితెర పై నాగాస్త్రం, సుందరకాండ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సీతయ్య’ ‘అరుంధతి’ వంటి పెద్ద సినిమాల్లో నటించినా ఆమెకు గుర్తింపు దక్కలేదు. ఆమె దాదాపుగా 12 చిత్రాల్లో కనిపించారు. ఇక ఆమెతో పాటు కూతురు కూడా సినిమాల్లో అడుగుపెట్టింది. కానీ అమ్మలాగే కూతురికి కూడా సక్సెస్ కాలేకపోయింది.
సుభాషిణి కూతురు పూజ ప్రియాంక పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ తో చేసిన 143 చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. ఆ మూవీలో సాయిని వన్ సైడ్ లవ్ చేస్తూ కనిపించింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో గుర్తింపు దక్కలేదు. దీంతో 2012లో పెళ్లి చేసుకున్న పూజ ప్రియాంక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. జయసుధ స్టార్ హీరోయిన్‌గా ఎదిగినప్పటికీ తన సోదరితో ఆమె కూతురు కూడా ఇండస్ట్రీలో అంతగా పేరు సంపాదించలేకపోయారు.
(ఇది చదవండి: ఆరు నెలల వ్యవధిలో అమ్మానాన్న మరణం.. నన్ను ఒంటరిగా వదిలేసి)
Comments
Please login to add a commentAdd a comment