రేపు 'మా' ఓట్ల లెక్కింపు | 'maa' election result tommorow | Sakshi
Sakshi News home page

రేపు 'మా' ఓట్ల లెక్కింపు

Published Thu, Apr 16 2015 6:04 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

రేపు 'మా' ఓట్ల లెక్కింపు

రేపు 'మా' ఓట్ల లెక్కింపు

హైదరాబాద్: ఎట్టకేలకు 'మా' అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. ఫలితాల వెల్లడిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సివిల్ కోర్టు చెప్పడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఫిల్మ్ చాంబర్లో ఉదయం పదిగంటలకు లెక్కింపు జరగనుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యంత వివాదాస్పదంగా మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 'మా' అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీపడగా, ఎన్నికలు మార్చి 29వ తేదీన జరిగాయి.

702 మంది సభ్యుల్లో 394 మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికలను నిలిపివేయాలని నిర్మాత ఓ కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. దాంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించడంతో, కౌంటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement