maa election results
-
చల్లారని ‘మా’ రగడ.. ఎన్నికల అధికారికి లేఖ రాసిన ప్రకాశ్ రాజ్
MAA Elections 2021 Results: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పర్వం ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలింగ్ జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు ప్రకాశ్‌రాజ్. పోలింగ్ జరిగిన రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు గురువారం లేఖ రాశారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్ మా సభ్యులను బెదిరించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మీరే వారిని, వారి అనుచరులను పోలింగ్ ప్రదేశాల్లోకి అనుమతించారని భావిస్తున్నామన్నారు. మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసిందన్నారు. అసలేం జరిగిందన్నది మా సభ్యులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారని, ఇందుకోసం పోలింగ్ సమయంలో రికార్డైన సీసీ టీవీ దృశ్యాలు తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరగా స్పందించకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 3 నెలల వరకు దృశ్యాలు భద్రపరచడం మీ బాధ్యత అంటూనే వాటిని కోరే హక్కు తమకు ఉందని నొక్కి చెప్పారు. ప్రకాశ్‌రాజ్ లేఖపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా ఇవ్వడానికి రెడీ అని తెలిపారు. -
జయసుధ ఓటమిని ముందే ఊహించారా?
జయసుధ మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాలు ముందే ఊహించారా ? అందుకే గురువారం కౌంటింగ్ జరుగుతున్న ఫిల్మ్ చాంబర్ వైపు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు. మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన ప్రతి రౌండ్లో ఆమె ప్రత్యర్థి రాజేంద్రప్రసాద్ ముందంజలో ఉన్నారు. చివరి రౌండ్ వరకు ఆయన అదే హవా కొనసాగారు. దీంతో జయసుధకు ఓటమి తప్పలేదు. ఆమె తరపున సమీప బంధువు హీరో నరేష్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు ఆయన అక్కడే ఉన్నారు. ఎప్పుడు సాదాసీదాగా జరిగే మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికలను తలపించాయి. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ మా ఎన్నికల్లో పోటి చేస్తున్నట్లు ప్రకటించిన కొన్నాళ్ల తర్వాత.. అనూహ్యంగా మురళీమోహన్ వర్గం తమ తరపున జయసుధ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకుని... మీడియా సాక్షిగా రోడ్డెక్కారు. అంతలో ఎన్నికలు రానే వచ్చాయి. మార్చి 29వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఇంతలో నటుడు, నిర్మాత ఓ.కళ్యాణ్ మా ఎన్నికల తీరును సవాల్ చేస్తూ...సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు.. మా ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలని ఆదేశించింది. చివరకు ఫలితాల వెల్లడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. 'మా' లో 702 మంది సభ్యులు ఉన్నా కేవలం 394 ఓట్లు పోలయ్యాయి. రాజేంద్రప్రసాద్ 85 ఓట్లు తేడాతో విజయం సాధించారు. -
ఫలితాల పై సినీ ఇండస్ట్రీలో ఉత్కంఠ
-
మంచి కోసం మార్పు కోసం...
-
రేపు 'మా' ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: ఎట్టకేలకు 'మా' అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. ఫలితాల వెల్లడిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సివిల్ కోర్టు చెప్పడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఫిల్మ్ చాంబర్లో ఉదయం పదిగంటలకు లెక్కింపు జరగనుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యంత వివాదాస్పదంగా మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 'మా' అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీపడగా, ఎన్నికలు మార్చి 29వ తేదీన జరిగాయి. 702 మంది సభ్యుల్లో 394 మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికలను నిలిపివేయాలని నిర్మాత ఓ కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. దాంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించడంతో, కౌంటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలపనున్నారు. -
'మా' ఎన్నికల ఫలితాలకు లైన్ క్లియర్
-
'మా' ఎన్నికల ఫలితాలకు లైన్ క్లియర్
ఈసారి అత్యంత వివాదాస్పదంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') ఎన్నికల ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. ఫలితాల విడుదలను నిలిపివేయాలంటూ సినీ నిర్మాత ఓ కళ్యాణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు కొట్టేసింది. ఎన్నికల అధికారి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే కౌంటింగ్ నిర్వహించుకోవచ్చని తెలిపింది. 'మా' అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీపడగా, ఎన్నికలు మార్చి 29వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. 702 మంది సభ్యుల్లో 394 మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికలను నిలిపివేయాలని నిర్మాత ఓ కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. దాంతో ఇప్పుడు ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించడంతో, కౌంటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే, శుక్ర లేదా శనివారాల్లో ఈ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. కాగా.. ఓ కళ్యాణ్‌పై సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలను ఆపలేమని తేల్చి చెప్పింది. కళ్యాణ్‌కు రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. వ్యవహారాన్ని రచ్చకీడ్చారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.