Senior Political Leaders May To Join In Telangana BJP - Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ఆకర్ష్‌.. జయసుధ సహా తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు!

Jul 29 2023 11:56 AM | Updated on Jul 29 2023 12:35 PM

Senior Political Leaders May To Join In Telangana BJP - Sakshi

తెలంగాణలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఫలితానిస్తోంది..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో చేరికలపై నేతలు బిజీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు.. సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో ప్లాన్స్‌ చేస్తున్నారు. దీంతో, బీజేపీలో చేరికలు భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

కాగా, తెలంగాణలో కొందరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు బీజేపీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి డీసీసీబీ మాజీ  చైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి బీజేపీ లో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఇప్పటికే వివేక్‌ను కలిశారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డితో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ భేటీ అయ్యారు. ఈ క్రమంలో జయసుధ బీజేపీలో చేరేందుకు ప్లాన్‌ చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. హైకమాండ్‌ పిలుపు నేపథ్యంలో కిషన్‌రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. ఈటల రాజేందర్‌ సైతం ఈరోజు ఢిల్లీలోకి వెళ్లనున్నారు. వీరి తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాత పార్టీలో చేరికలపై ప్లాన్‌ చేసే అవకాశం ఉన్న‍ట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: బండి సంజయ్‌, డీకే అరుణకు కీలక పదవులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement