
డాలీ శేఖర్, కాలా రాజేశ్, జయసుధ, ప్రసాద్, రేణుక
‘‘సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపండి, ఆడపిల్లలను కాపాడండి’’ వంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రాన్ని తీసిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే మరికొన్ని మంచి సినిమాలు తీయటానికి దర్శక–నిర్మాతలు ముందుకు వస్తారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది’’ అన్నారు నటి జయసుధ.
వెంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై కాలా రాజేశ్ దర్శకత్వంలో కె. ప్రసాద్ రెడ్డి నటించి, నిర్మించిన చిత్రం ‘ఆ నిమిషం’. ఈ చిత్రం టీజర్‌ను నటి జయసుధ రిలీజ్ చేశారు. ‘‘మా టీజర్‌ను జయసుధగారు విడుదల చేయటం ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం. నిర్మాతకు కృతజ్ఞతలు’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: కున్నీ గుడిపాటి, కెమెరామేన్: యోగి ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment