నా సహచరుడు... నా ఆంతరంగికుడు... | Heartbroken wife of Nitin Kapoor, Jayasudha, requests privacy | Sakshi
Sakshi News home page

నా సహచరుడు... నా ఆంతరంగికుడు...

Published Sat, Mar 18 2017 12:47 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

నా సహచరుడు... నా ఆంతరంగికుడు... - Sakshi

నా సహచరుడు... నా ఆంతరంగికుడు...

‘‘32 ఏళ్ల క్రితం ఇదే రోజున నా పెళ్లి జరిగింది. ఇవాళ మా వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మేం ఇద్దరం గడిపిన అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటున్నా’’ అని శుక్రవారం ఫేస్‌బుక్‌లో జయసుధ పేర్కొన్నారు. ఆమె భర్త నితిన్‌కపూర్‌ గత మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నారు. చికిత్స కూడా చేయించుకుంటున్నారు. అయితే హఠాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకుంటారని జయసుధ ఊహించి ఉండరు. తేరుకోవడానికి ఆమెకు కొంత సమయం పడుతుందని చెప్పొచ్చు. కాగా, మార్చి 17 నితిన్‌కపూర్‌–జయసుధల పెళ్లిరోజు.

ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘నా ప్రియమైన భర్త, నా ఆంతరంగికుడు, నా సహచరుడు.. నితిన్‌కపూర్‌ ఇప్పుడు స్వర్గలోకంలో దేవతలతో ప్రశాంతంగా ఉన్నారు. కొన్నాళ్లుగా ఏ ప్రశాంతతను అయితే ఆశించారో దాన్ని దక్కించుకున్నారు. ఆయన డిప్రెషన్‌లో ఉన్నది నిజం. అయితే అది చికిత్సను కూడా అధిగమించేసింది’’ అన్నారామె. ‘‘32 ఏళ్ల క్రితం మా పెళ్లి జరిగింది. ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఇవాళ ఆయన లేరు. ఎక్కడ ఉన్నా, కింద ఉన్న మమ్మల్ని చూస్తూ, తన ప్రేమతో మాకు రక్షణగా ఉంటారని నా నమ్మకం’’ అని జయసుధ పేర్కొన్నారు.

‘‘నా జీవితంలో జరిగిన ఈ బాధకరమైన సంఘటనను సంచలనం చేయకుండా, నా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వడం ఇప్పుడు నాకు కావాల్సిన ముఖ్యమైన విషయం. అది అర్థం చేసుకుని, నా మనోభావాలకు గౌరవం ఇచ్చిన మీడియాని అభినందించకుండా ఉండలేకపోతున్నాను’’ అని కూడా అన్నారామె.‘‘ఆ దేవుడు నా భర్తకు కావల్సినంత ఆనందాన్ని, ప్రశాంతతనూ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు జయసుధ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement