Nitin Kapoor
-
నా సహచరుడు... నా ఆంతరంగికుడు...
‘‘32 ఏళ్ల క్రితం ఇదే రోజున నా పెళ్లి జరిగింది. ఇవాళ మా వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మేం ఇద్దరం గడిపిన అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటున్నా’’ అని శుక్రవారం ఫేస్బుక్లో జయసుధ పేర్కొన్నారు. ఆమె భర్త నితిన్‌కపూర్ గత మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన డిప్రెషన్లో ఉన్నారు. చికిత్స కూడా చేయించుకుంటున్నారు. అయితే హఠాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకుంటారని జయసుధ ఊహించి ఉండరు. తేరుకోవడానికి ఆమెకు కొంత సమయం పడుతుందని చెప్పొచ్చు. కాగా, మార్చి 17 నితిన్‌కపూర్–జయసుధల పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఫేస్బుక్ ద్వారా ఆమె కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘నా ప్రియమైన భర్త, నా ఆంతరంగికుడు, నా సహచరుడు.. నితిన్‌కపూర్ ఇప్పుడు స్వర్గలోకంలో దేవతలతో ప్రశాంతంగా ఉన్నారు. కొన్నాళ్లుగా ఏ ప్రశాంతతను అయితే ఆశించారో దాన్ని దక్కించుకున్నారు. ఆయన డిప్రెషన్లో ఉన్నది నిజం. అయితే అది చికిత్సను కూడా అధిగమించేసింది’’ అన్నారామె. ‘‘32 ఏళ్ల క్రితం మా పెళ్లి జరిగింది. ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఇవాళ ఆయన లేరు. ఎక్కడ ఉన్నా, కింద ఉన్న మమ్మల్ని చూస్తూ, తన ప్రేమతో మాకు రక్షణగా ఉంటారని నా నమ్మకం’’ అని జయసుధ పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో జరిగిన ఈ బాధకరమైన సంఘటనను సంచలనం చేయకుండా, నా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వడం ఇప్పుడు నాకు కావాల్సిన ముఖ్యమైన విషయం. అది అర్థం చేసుకుని, నా మనోభావాలకు గౌరవం ఇచ్చిన మీడియాని అభినందించకుండా ఉండలేకపోతున్నాను’’ అని కూడా అన్నారామె.‘‘ఆ దేవుడు నా భర్తకు కావల్సినంత ఆనందాన్ని, ప్రశాంతతనూ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు జయసుధ. -
జయసుధ భర్త నితిన్ కపూర్ కారు దగ్ధం
హైదరాబాద్, సాక్షి: ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ ప్రయాణిస్తున్న కారు గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అయితే, నితిన్ కపూర్‌తో పాటు కారులోని వారి పనిమనిషి, డ్రైవర్ ప్రమాదంనుంచి బయుటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే కారులో మంటలు చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం స్విప్ట్ కారులో నితిన్ కపూర్ మంగళవారం రాత్రి మణికొండ నుంచి గచ్చిబౌలికి బయలు దేరారు. గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్‌పైకి చేరగానే కారు హెడ్లైట్లు ఆరిపోయాయి. వురి కొద్దిసేపటికే హెడ్లైట్ల నుంచి పొగలు కూడా వచ్చాయి. దీనితో ప్రమాదాన్ని శంకించి, వారు కారు నిలిపేసి, తవు సామగ్రితో దిగిపోయారు. కొద్ది సేపట్లోనే మంటలు కారంతా వ్యాపించాయి. దట్టమైన పొగ, వుంటలతో రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసినా, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న జయసుధ కూడా సంఘటనా స్థలానికి వచ్చి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో ఫ్లైఓవర్‌కు ఇరువైపులా ట్రాఫిక్ కొద్దిసేపు నిలిచిపోయింది. -
జయసుధ భర్తకు తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కుమార్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన కపూర్ వెంటనే కారు దిగిపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంటలో కారు పూర్తిగా తగలబడిపోయింది. కార్లలో మంటలు వ్యాపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కారులో ఆదివారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సింగన్నగూడెం చౌరస్తావద్ద జాతీయ రహదారిపై రాత్రి 8.30గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది. మంత్రితో పాటు ఆయన తమ్ముడు కృష్ణారెడ్డి, పీఏ నవీన్, డ్రైవర్ కృష్ణ, గన్మెన్లు ఎల్లయ్య, హరినారాయణ, రాంబాబు, సుబ్బారావులు కారులో ఉన్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వెళ్తూ సింగన్నగూడెం వద్దకు రాగానే డ్యాష్‌బోర్డు నుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే కారాపి అందరూ కిందికి దిగారు. డ్రైవర్ కారు బోయ్నెట్ను ఎత్తి వైర్లను సరిచేస్తుండగానే పెద్దఎత్తున మంటలు లేచాయి. డీజిల్ ట్యాంకు పగిలిపోయింది.