జయసుధ భర్త నితిన్ కపూర్ కారు దగ్ధం | Jayasudha's husband Nitin kapoor car burned | Sakshi
Sakshi News home page

జయసుధ భర్త నితిన్ కపూర్ కారు దగ్ధం

Published Wed, Sep 11 2013 1:35 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

జయసుధ భర్త నితిన్ కపూర్ కారు దగ్ధం - Sakshi

జయసుధ భర్త నితిన్ కపూర్ కారు దగ్ధం

హైదరాబాద్, సాక్షి: ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ ప్రయాణిస్తున్న కారు గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అయితే, నితిన్ కపూర్‌తో పాటు కారులోని వారి పనిమనిషి, డ్రైవర్ ప్రమాదంనుంచి బయుటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే కారులో మంటలు చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం స్విప్ట్ కారులో నితిన్ కపూర్ మంగళవారం రాత్రి మణికొండ నుంచి గచ్చిబౌలికి బయలు దేరారు. గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్‌పైకి చేరగానే కారు హెడ్‌లైట్లు ఆరిపోయాయి. వురి కొద్దిసేపటికే హెడ్‌లైట్ల నుంచి పొగలు కూడా వచ్చాయి.
 
 దీనితో ప్రమాదాన్ని శంకించి, వారు కారు నిలిపేసి, తవు సామగ్రితో దిగిపోయారు. కొద్ది సేపట్లోనే మంటలు కారంతా వ్యాపించాయి. దట్టమైన పొగ, వుంటలతో రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసినా, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న జయసుధ కూడా సంఘటనా స్థలానికి వచ్చి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో ఫ్లైఓవర్‌కు ఇరువైపులా ట్రాఫిక్  కొద్దిసేపు నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement