shot circuit
-
మోటార్ వైరే మంట పెట్టింది!
సాక్షి, హైదరాబాద్: వాటర్ మోటార్ వైరులో ఏర్పడిన షాట్‌సర్క్యూట్ కారణంగానే బజార్‌ఘాట్‌లోని బాలాజీ రెసిడెన్సీలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రా థమికంగా నిర్థారించారు. ఉదంతం చోటు చేసుకున్న భవ నం గ్రౌండ్ ఫ్లోర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను విశ్లేషించిన నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చారు. సోమ వారం జరిగిన ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృతిచెందిన విషయం విదితమే. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని మొదట్లోనే భావించినా... ఎప్పుడు? ఎక్కడ నుంచి జరిగిందనేది తాజాగా క్లూస్ టీమ్ అధికారులు గుర్తించారు. కేసింగ్ దెబ్బతిని వైర్లు బయటకు... ఈ అపార్ట్‌మెంట్‌ను జీ+4 విధానంలో నిర్మించారు. మధ్యలో లిఫ్ట్, మెట్లు ఉండగా... వీటికి కుడి వైపున నాలుగు, ఎడమ వైపున నాలుగు చొప్పున ఫ్లాట్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ గదితో పాటు యజమాని రమేష్ జైశ్వాల్‌కు సంబంధించిన అక్రమ గోదాములు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కుడి వైపు వాచ్మెన్ రూమ్ పక్కన పాలిమర్ షీట్లు నిల్వ ఉంచగా.. ఎడమ వైపు రసాయనాల డబ్బాలు ఉంచారు. దీనికి సమీపంలోనే కొన్ని కార్టన్ బాక్సుల్నీ నిల్వ చేశారు. వీటి వెనుక ఉన్న గోడకు స్టార్టర్ నుంచి మీటర్ వరకు వెళ్ళిన వైరు కేసింగ్‌తో ఉంది. కార్టన్ బాక్సుల్ని పదేపదే కదిపిన కారణంగా కేసింగ్ దెబ్బతినడంతో వైర్లు బయటకు వచ్చి ఉంటాయని, ఇవి రాపిడికి గురికావడంతో పైన ఉండే పొర దెబ్బతిని లోహపు వైరు బయటకు వచ్చి ఉంటుందని క్లూస్ టీమ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మోటార్ ఆన్ చేసిన కొన్ని నిమిషాలకే... అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్య సోమవారం ఉదయం 8.15 గంటలకు మోటార్ ఆన్ చేశారు. దాదాపు అర్ధగంట తర్వాత 8.45 నిమిషాల ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయడం మానేశాయి. దీన్ని బట్టి అప్పుడే షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాచ్మెన్ దంపతులను ప్రశ్నించిన పోలీసులు మరికొన్ని వివరాలు సేకరించారు. షార్ట్‌సర్క్యూట్ ప్రభావంతో వచ్చిన నిప్పురవ్వల కారణంగా కార్టన్ బాక్సులకు నిప్పు అంటుకుంది. గమనించిన వాచ్మెన్ దంపతులు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ లోపే ఆ బాక్సుల్లో ఉన్న మెటీరియల్ అంటుకుని మంటలు విస్తరించడం మొదలయ్యాయి. వాచ్మెన్ కాలికి గాయం కావడంతో వేగంగా స్పందించలేకపోయాడు. దాంతో మంటలు రసాయనాలకు అంటుకోవడంతో ఊహించని నష్టం జరిగిపోయింది. ఉస్మానియా ఆస్పత్రిలోని బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్న మరో బాధితుడు తల్హా (17) పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులకు టీమార్ట్ అగ్ని ప్రమాదం కేసు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలోని టీమార్ట్ అగ్నిప్రమాదం కేసు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చేరింది. నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని ఆర్యనగర్‌లో గల టీమార్ట్ సూపర్ మార్కెట్లో 2022 ఆగస్టు 28న రాత్రి 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. టీమార్ట్‌లో ఉన్న సుమారు రూ. 2 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. కేసులో నగరంలోని ఓ ప్రజాప్రతినిధి బంధువుతో పాటు మరి కొందరు, ఓ పోలీస్ అధికారి ఎంట్రీ కావడంతో కేసు డీలా పడింది. ప్రమాదానికి కారణమైన ఆధారాలను సేకరించిన పోలీసులు.. కొన్నింటిని లేకుండా చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో కేసు ఆలస్యం కావడంతో బాధితుడు కొంత కాలంగా పోలీసు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో టీమార్ట్ కేసు ఫైల్ మళ్లీ తెరపైకి వచ్చింది. కేసును ట్రాస్క్ఫోర్స్కు అప్పగించడంతో కేసు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రంగంలోకి టాస్క్‌ఫోర్స్ టీమార్ట్ అగ్నిప్రమాదం కేసును నీరుకార్చడానికి ప్రయత్నించిన ఓ ప్రజాప్రతినిధి బంధువు, ఓ పోలీసు అధికారి, కొంత మంది వివరాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కేసును పక్కదారి పట్టించడానికి ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. దీంతో 10 నెలలుగా కేసును పోలీసులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఈ కేసును మళ్లీ టాస్క్‌ఫోర్స్‌కు చేరడంతో ప్రజాప్రతినిధి బంధువుతో పాటు ఓ పోలీసు అధికారి, మరి కొందరు కలిసి బాధితుడితో ఒప్పందం పేరుతో రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మంత్రి, సీపీకి ఫిర్యాదు చేయడంతో..! బాధితుడు శేఖర్ అగ్నిప్రమాదం కేసు విషయమై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును పరిశీలించాలని పోలీసులకు మంత్రి ఆదేశాాలు జారీ చేయడంతో టీమార్ట్ కేసులో పురోగతి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఏసీపీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసు వివరాలను సేకరించే పనిలో పడినట్లు తెలిసింది. కేసు ఈ సారైనా కొలిక్కి వస్తుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. అయితే కేసు విషయమై టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్‌ను సంప్రదించగా ఇన్చార్జి సీపీ, ఏసీపీల ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేస్తుండగా..
కుషాయిగూడ: సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేస్తుండగా షాట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన శుక్రవారం చర్లపల్లిలో చోటు చేసుకుంది. వెంకట్‌రెడ్డినగర్ కాలనీకి చెందిన చెన్నమ్మ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో చెన్నమ్మ ఆమె భర్త బయటకు వెళ్లగా కొడుకు తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లాడు. చార్జింగ్ పెట్టిన చోట షాట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. పొగలు రావడాన్ని గమనించిన అతడు బయటకు వచ్చి చూడగా ఇంట్లో వస్తువులకు మంటలు అంటుకుంటున్నాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లోని బట్టలు, వస్తువులు, ఆహార పదార్థాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలిసిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించి ఆదకుంటానని హామీ ఇచ్చారు. ఆమె వెంట నాగిళ్ల బాల్‌రెడ్డి, కనకరాజుగౌడ్, ప్రభుగౌడ్ తదితరులు ఉన్నారు. (చదవండి: ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్పై కేసు నమోదు) -
ల్యాప్‌టాప్ పేలి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లెలో ల్యాప్‌టాప్ పేలి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సుమలత (22) అనే టెక్కీ సోమవారం ఉదయం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బెడ్‌పైన కూర్చొని వర్క్ చేస్తున్న సుమలత విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బెడ్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్పడికే తీవ్రంగా గాయపడిన సుమలతను చికిత్స నిమిత్తం కడప సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలవ్వడంతో యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సుమలత బెంగుళూరుకు చెందిన మ్యాజిక్ టెక్ సొల్యూషన్‌లో పనిచేస్తోంది. చదవండి: ‘మీకు పెన్ ఉంటే, మాకు గన్ ఉంది’.. జర్నలిస్టుపై పోలీస్ దురుసు ప్రవర్తన -
అర్ధరాత్రి వేళ.. అగ్నిప్రమాదం
సాక్షి, హన్మకొండ : అందరూ నిద్రిస్తున్న వేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భవనం పూర్తిగా దెబ్బతిని స్లాబ్ లోపలి చువ్వలు బయటకు రావడం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తుండగా దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు నైట్ వాచ్మెన్ అంజనేయులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఏబీకే మాల్లోని రెండో అంతస్తులో మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఏర్పాటుకు అద్దెకు తీసుకున్నారు. కార్యాలయానికి అనువుగా తీర్చిదిద్దుతున్న పనులు చివరి దశకు చేరుకోగా.. కార్మికులు రెండో అంతస్తులో నిద్రించారు. ఇందులో కొందరు తెల్లవారుజామున మూత్రవిసర్జనకు నిద్ర లేవగా మంటలు కనిపించడంతో ఫైర్ స్టేషన్‌కే కాకుండా భవనంలోని ఇతర సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేశారు. దీంతో హన్మకొండ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నేతృత్వంలో సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల ద్వారా చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్ కార్యాలయంలోని ఏసీల తదితర సామగ్రి దెబ్బతిన్నదని అసిస్టెంట్ మేనేజర్ బి.రామారావు తెలిపారు. అయితే, పై అంతస్తుల్లో ఉన్న కార్యాలయాలకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ మాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజియన్ కార్యాలయం, ఏపీజీవీబీతో పాటు చిట్‌ఫండ్ కార్యాలయాలు, మెడికల్ షాపులు ఉన్నాయి. -
అగ్ని ప్రమాదంలో ఇళ్లు బుగ్గి
సాక్షి, ఉండి(పశ్చిమగోదావరి) : శుక్రవారం తెల్లవారు జామున కోలమూరు ఎస్సీ పేటలో భయానక వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి 8 ఇళ్లు పూర్తిగా దగ్ధమవడమమే కాకుండా 4 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 3:20 నిమిషాలకు గ్రామానికి చెందిన ఇగ్గిరిసి శేఖర్ ఇంట్లోని ఫ్యాన్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తీగల నుంచి మంటలు ఏర్పడి ఒక్కసారిగా చుట్టు పక్కల ఇళ్లకు వ్యాపించాయి. వెంటనే స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. కొన్ని ఇళ్లకు కొబ్బరాలకుతో దడి ఏర్పాటు చేయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌కు తోడు గ్యాస్ సిలిండర్లుకు మంటలు వ్యాపించి అవి పేలడం ప్రారంభిండంతో గ్రామమంతా ఒక్కసారిగా భయాందోళకు గురయ్యారు.ఎవ్వరూ మంటలను అదుపుచేసే ప్రయత్నం చేయలేకపోయారు.ఈ అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో 13 కుటుంబాలు రోడ్డున పడ్డారు. నాలుగు కుటుంబాలు కొంత మేర నష్టపోయాయి. ఇగ్గిరిసి శేఖర్, ఇగ్గిరిసి సత్యానందం, ఇగ్గిరిసి యెషయా, నేతల కృష్ణమూర్తి, నేతల వరదయ్య, రుద్దర్రాజు సత్యనారాయణరాజు, ఇంజేటి సుబ్బమ్మ, ఇంటి ఆనందరావు, నేతల బుజ్జి, నేతల కాంతమ్మ, ఇంటి శాంతారావు, మద్దా సరస్వతి, ఇంటి ఇస్సాకు చెందిన ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇగ్గిరిసి ఆనందరావు, నేతల మార్టిన్, పాము యేసు, ఇంటి కృష్ణయ్యకు చెందిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అనంతరం సమాచారం అందడంతో ఫైరింజన్ సాయంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్థి నష్టం ఏర్పడినట్టు అంచనా వేస్తున్నామని ఆకివీడు అగ్నిమాపక అధికారి మహమ్మద్ ఆలీబేగ్ తెలిపారు. పీవీఎల్ పరావర్శ అగ్ని ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న వైఎ స్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితుల పరిస్థితిని పరిశీలించారు. తహసీ ల్దార్ కె రామఆజనేయులతో పరిస్థితిపై సమీక్షిం చారు. హౌసింగ్ అధికారులకు ఫోన్ చేసి వెంటనే గృహనిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు, 10 కేజీల బియ్యాన్ని అందించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరిచర్ల సుభాష్‌రాజు స్వగ్రామం కోలమూరు కావడంతో తెల్లవారుజాము నుంచి ఆయన బాధితులకు అండగా నిలిచివారికి తన సహాయ సహకారాలు అందించారు. ఎమ్మెల్యే మంతెన రాంబాబు కోలమూరు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి నగదు, 25 కేజీల బియ్యాన్ని అందించినట్లు తెలిపారు. దళిత సైనిక్ సహకారం దైళిత సైనిక్ ఆధ్వర్యంలో కోలమూరు అగ్నిప్రమాద బాధితులకు సహకారం అందించినట్లు మాలమహానాడు జిల్లా యువజన అధ్యక్షుడు మీసాల జయరాజు తెలిపారు. 500 కేజీల బియ్యం, దుప్పట్లు అందినట్లు ఆయన తెలిపారు. బిరుదుగడ్డ రమేష్‌బాబు, అయినపర్తి రాహుల్, పోతుల జాన్‌బాబు, ట్రావెల్స్ ప్రభు పాల్గొన్నారు. బాధితులను కాపాడిన బాలుడు కోలమూరు అగ్ని ప్రమాదంలో ఐదు గ్యాస్ సిలిండర్లు పేలినా, భయానకంగా మం టలు చెలరేగినా ఆస్తి బుగ్గి అయింది కాని ఏ ఒక్క ప్రాణా నికి హాని కలగలేదంటే దానికి కారణం ఓ బాలుడు. అతడే ఇగ్గిరిసి సంజయ్. తెల్లవారు జాము కావడంతో అందరూ ఆదమరచి నిద్రపోతున్న సమయంలో సంజయ్ పక్క ఇంట్లో మంటలను గుర్తించి నిద్రలేచి బయటకు వచ్చా డు. అప్పటికే మంటలు చుట్టుపక్కలకు వ్యాపిం చాయి. తండ్రి చేపల ప్యాకింగ్‌కు వెళ్లడంతో నిద్రపోతున్న తన చెల్లి సంజయ్ ముందుగా ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి అరిచి అందరినీ అప్రమత్తం చేశాడు. సంజయ్ చిన్నాన్న ఇతర కుటుంబీకులు నిద్రలేచిరావడంతో ఎగిసిపడుతున్న మంటలను గమనించి వెంటనే అందర్నీ నిద్రలేపి అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణా పాయం జరగకుండా కాపాడుకోగలిగారు. ప్రతి ఒక్కరూ సంజయ్‌ను అభినందిస్తున్నారు. -
స్కూల్ బస్సు దగ్ధం
సాక్షి, హైదరాబాద్ : కూటల్పల్లిలోని వివేకానంద నగర్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. మరో రెండు బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. వివేకనంద నగర్‌కి చెందిన భాష్యం స్కూల్‌కి చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాట్ సర్క్యుట్తోనే ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. -
విద్యుత్ వైర్లు తగిలి అగ్నికి ఆహుతైన పత్తి
-
జయసుధ భర్త నితిన్ కపూర్ కారు దగ్ధం
హైదరాబాద్, సాక్షి: ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ ప్రయాణిస్తున్న కారు గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అయితే, నితిన్ కపూర్‌తో పాటు కారులోని వారి పనిమనిషి, డ్రైవర్ ప్రమాదంనుంచి బయుటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే కారులో మంటలు చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం స్విప్ట్ కారులో నితిన్ కపూర్ మంగళవారం రాత్రి మణికొండ నుంచి గచ్చిబౌలికి బయలు దేరారు. గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్‌పైకి చేరగానే కారు హెడ్లైట్లు ఆరిపోయాయి. వురి కొద్దిసేపటికే హెడ్లైట్ల నుంచి పొగలు కూడా వచ్చాయి. దీనితో ప్రమాదాన్ని శంకించి, వారు కారు నిలిపేసి, తవు సామగ్రితో దిగిపోయారు. కొద్ది సేపట్లోనే మంటలు కారంతా వ్యాపించాయి. దట్టమైన పొగ, వుంటలతో రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసినా, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న జయసుధ కూడా సంఘటనా స్థలానికి వచ్చి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో ఫ్లైఓవర్‌కు ఇరువైపులా ట్రాఫిక్ కొద్దిసేపు నిలిచిపోయింది.