
సాక్షి, హైదరాబాద్ : కూటల్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. మరో రెండు బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. వివేకనంద నగర్‌కి చెందిన భాష్యం స్కూల్‌కి చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాట్ సర్క్యుట్‌తోనే ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.