![Unstoppable With NBK: Balakrishna, Prabhas Episode Visuals Leaked - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/12/balakrishna-and-prabhas.jpg.webp?itok=ewcB37Tr)
నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుత్ను ఈ షో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. అత్యధిక వ్యూవర్‌షిప్‌ను రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సెకండ్ సీజన్‌ను జరపుకుంటున్న ఈ షోలో ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రీసెంట్‌గా జరిగిన 5వ ఎపిసోడ్‌లో అగ్ర నిర్మాతలు సురేశ్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి అతిథులుగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ఈ ఎపిసోడ్ రెండు రోజుల్లో 2 మిలియన్స్ స్ట్రీమింగ్ పర్ మినిట్‌తో దూసుకుపోయి రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఆరవ ఎపిసోడ్‌కు పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ ‘బాహుబలి’ ప్రభాస్ సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆదివారం ఆహా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి అన్‌స్టాపబుల్ విత్ ప్రభాస్, బాలయ్య విత్ ప్రభాస్ అంటూ ట్విటర్‌లో హ్యాష్ ట్యాగ్స్ దర్శనం ఇస్తున్నాయి. అంతేకాదు ఈ విషయం తెలిసినప్పుటి ఈ ఎపిసోడ్ కోసం అటూ ప్రభాస్, ఇటూ నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Darling 💛😍😘#NBKWithPrabhas#UnstoppableWithPrabhas#UnstoppableWithNBKS2 pic.twitter.com/Rdl8quPNSO
— Prabhas™ (@Prabhas_Team) December 11, 2022
ఇప్పటికే ‘డార్లింగ్’ అన్‌స్టాపబుల్ సెట్‌లో అడుగుపెట్టిన తెలుస్తోంది. ఈ టాక్ షోలో బాలయ్యతో ప్రభాస్ సందడి చేసిన వీడయో ఒకటి బయటకు వచ్చింది. చూస్తుంటే ఇది ప్రభాస్ ఎంట్రీ వీడియోల కనిపిస్తోంది. ఇందులో ప్రభాస్ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. కొత్త హెయిర్ కట్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్‌తో కూడిన చెక్ షర్ట్‌లో ప్రభాస్ పక్కా జెంటిల్ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ షోలో బాలయ్య ప్రభాస్‌ను ఎలాంటి చిలిపి ప్రశ్నలు వేయబోతున్నారు, ప్రభాస్ పెళ్లి గురించి ఎలా ఆరా తీయబోతున్నారనేది ఆసక్తిని సంతరించుకుంది.
Darling 💛😍😘#NBKWithPrabhas#UnstoppableWithPrabhas#UnstoppableWithNBKS2 pic.twitter.com/Rdl8quPNSO
— Prabhas™ (@Prabhas_Team) December 11, 2022
చదవండి:
అనుపమ పరమేశ్వరన్‌పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment