
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అంతా సీఎం జగన్ అజెండాపై చర్చ జరుగుతుంది. ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. అందుకే మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి రోజా అన్నారు.
చదవండి: గొంతు పిసికి చంపేశాడు! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’
58 సంవత్సరాల ముందే మనకి రాజధాని రావల్సింది, కానీ రాలేదని రోజా అన్నారు. నేడు సీఎం జగన్ ఈ ప్రాంతంలో న్యాయ రాజధాని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. రాయలసీమ బిడ్డగా ఇక్కడ న్యాయ రాజధాని రావాలని కోరుకుంటున్నానని మంత్రి స్పష్టం చేసారు. చంద్రబాబు తన బినామిల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు, రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులు కావాలని కోరుకుంటూ స్థానిక ఎన్నికల్లో తీర్పును ఇచ్చారు. పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతిలోనే రాజధాని నిర్మించాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు. నిజమైన రైతులైతే రైతు కష్టం తెలుస్తుంది.. కేవలం స్వార్థంతో కూడిన పాదయాత్ర అంటూ రోజా కొట్టిపారేశారు.
పవన్ కల్యాణ్ కుప్పిగంతులు, పిచ్చిగంతులు ఎవరు పట్టించుకోరని, ఎన్నో వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్.. ఉత్తరాంధ్ర కష్టాలు ఎప్పుడు చదవలేదా అని ప్రశ్నించారు. అన్‌స్టాపబుల్‌గా చంద్రబాబు అబద్దాలు చాలా బాగా చెప్పారని రోజా విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, ఆయన్ని ఆరాధ్య దైవం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు సీఎం కావడానికి కారణం కుప్పం ప్రజలు, కాని కుప్పానికి ఏమి చెయ్యలేదని మంత్రి రోజా దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment