నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ రెండో సీజన్ దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోలో సినీ ప్రముఖలతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొటుంటున్నారు. ఇప్పటికీ రవితేజ లాంటి సినియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ కూడా బాలయ్య షోలో పాల్గొని సందడి చేశారు.
ఐదో ఎపిసోడ్‌లో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ సురేశ్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి అతిథులుగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఇక ఆరో ఎపిసోడ్ ఏకంగా బాహుబలినే రంగంలోకి దించేశాడు బాలయ్య. ఈ విషయం గత కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం జరిగినప్పటికీ.. ప్రభాస్ వస్తాడో రాడో అని కొంత మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ విత్ గాడ్ ఆఫ్ మాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ రాబోతుందంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే షోలో ప్రభాస్ తన ప్రాణ స్నేహితుడు హీరో గోపిచంద్ తో కలిసి పాల్గొనబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment