డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ 'లైగర్'. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'లైగర్' గ్లింప్స్‌కు అనూహ్య స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ లైగర్ మూవీ టీమ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోకు హాజరైంది. ఇటీవలి ఎపిసోడ్‌లో పూరీ జగన్నాథ్‌తో పాటు విజయ్ దేవరకొండ, నిర్మాత ఛార్మీ కౌర్‌లు సందడి చేశారు. ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో వస్తున్న ఈ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో 'ఆహా' అనిపిస్తున్నాడు బాలకృష్ణ.
ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు..
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు సంబంధించిన త్రోబ్యాక్ వీడియోని ఎపిసోడ్ మధ్యలో టెలీకాస్ట్ చేయించాడు బాలకృష్ణ. ఒక టీవీ సీరియల్‌లో విజయ్ బాల నటుడిగా నటించాడు. ఈ వీడియో పూరీ జగన్నాథ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో గురించి తనకు తెలీదని షాక్ అయ్యాడు పూరీ. అనంతరం ఆ వీడియో పుట్టపర్తి సాయిబాబాపై తీసిన సీరియల్‌లోనిది అని విజయ్ తెలిపాడు. 'అందులో ఉన్నది నేనే కానీ ఆ వాయిస్ నాది కాదు. అప్పుడు సీరియల్ కోసం కొంచెం బొద్దుగా ఉన్నవాళ్లను సెలెక్ట్ చేసి పట్టుకెళ్లారు. వీడు అయితే డైలాగ్ చెప్పగలడు అని అనిపించినవారికి ఒక్కో డైలాగ్ అలా ఇచ్చారు.' అని విజయ్ దేవరకొండ ఆ వీడియో వెనుక ఉన్న కథను చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: ఇంటికి బొకే పంపి.. టచ్‌లో ఉండమని చెప్పింది.. ధనుష్-ఐశ్వర్యల లవ్‌స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment