నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఆయన ఎనర్జీ, చమత్కారం, కలుపుగోలుతనం, పంచ్‌లకు అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు ఈ షోకు విచ్చేసి సందడి చేయగా తాజాగా విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ అన్‌స్టాపబుల్‌లో రచ్చరచ్చ చేశారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా ఆహా వీడియో ఈ ఎపిసోడ్ నుంచి సరదా క్లిప్పింగ్‌ను షేర్ చేసింది. 'టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చుని నాలుగు క్వశ్చన్‌లు అడిగి, అవతలి వాళ్లు ఆన్సర్ చెప్పగానే మహాప్రభో అనుకోవడం నా వల్ల కాదని చెప్పాను. ఓ కండీషన్ పెట్టాను.. వచ్చినవాళ్లతో ఆడుకుంటానని కండీషన్ పెట్టాను' అంటూ మొదటగా విజయ్‌తో ఓ ఆటాడించాడు. వేలాడదీసిన శాండ్ బ్యాగ్‌కు ఒక్క పంచ్ ఇవ్వమన్నాడు. విజయ్ గట్టిగా పంచ్ ఇవ్వడంతో అది ఎంతో స్పీడుగా ముందుకెళ్లి తర్వాత వెనక్కు తిరిగి వచ్చింది. బాలయ్య.. 'తాను నటించిన మొదటి చిత్రం ఏది?' అని అడిగాడు. దీంతో విజయ్ నీళ్లు నములుతుండగా అక్కడ షోకు విచ్చేసిన అభిమానుల్లో నుంచి ఒకరు తాతమ్మ కల అని టపీమని బదులివ్వగా.. 'వాడు నా చేతిలో అయిపోయాడు, ఖతం' అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment