Unstoppable with NBK Season 2 Trailer Out - Sakshi
Sakshi News home page

Unstoppable With NBK 2: దెబ్బకి థింకింగ్‌ మారిపోవాలే.. ప్రోమో అదిరింది

Published Sun, Oct 9 2022 2:03 PM | Last Updated on Sun, Oct 9 2022 3:03 PM

Unstoppable with NBK Season 2 Trailer Out - Sakshi

నందమూరి నట సింహం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి ‘అన్‌ స్టాపబుల్‌’షోతో అందరిని అలరించారు.  ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమైన ఆ షో.. సూపర్‌ హిట్‌ అయింది. దీంతో సీజన్‌ 2 కూడా అనౌన్స్‌ చేశారు ఆహా నిర్వాహకులు. ఇటీవల అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2ని విజయవాడలో గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ సారి సీనీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను కూడా తీసుకొస్తున్నారు.

(చదవండి: ఆ వార్తలు మాకు చిరాకు కలిగించాయి: చిరంజీవి)

దీంతో అన్‌స్టాపబుల్‌ 2పై మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా సీజన్‌ 2కి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేశారు షో నిర్వాహకులు. ఇందులో బాలయ్య ఒక నిధి కోసం వెతికినట్టు, ఎన్నో అవరోధాలని దాటుకొని ఆ నిధిలో ఉన్న కత్తిని  చేజిక్కించుకున్నట్టు చూపించారు. ఆ కత్తితో షోలోకి ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ‘ప్రశ్నల్లో మరింత ఫెయిర్, ఆటల్లో మరింత డేర్, సరదాల్లో మరింత సెటైర్.. మీ కోసం మరింత రంజుగా.. అన్‌స్టాపబుల్’, దెబ్బకి థింకింగ్‌ మారిపోవాలే’అనే డైలాగ్స్‌తో బాలయ్య అలరించాడు. ఈ షో మొదటి ఎపిసోడ్‌ అక్టోబర్‌ 14న స్ట్రీమింగ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement