NBK Unstoppable Final Episode With Mahesh Babu Release Date Locked - Sakshi
Sakshi News home page

Unstoppable With Mahesh Babu: బాలకృష్ణతో మహేశ్‌ బాబు సందడి.. అదే చివరి ఎపిసోడ్‌

Published Fri, Jan 21 2022 1:01 PM | Last Updated on Sat, Apr 9 2022 9:30 PM

NBK Unstoppable Episode With Mahesh Babu Release Date Out - Sakshi

Mahesh Babu In NBK's Unstoppable Show: నటనతో ఆద్యంతం మెప్పించిన నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా అదరగుడుతున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. విభిన్నమైన సినిమాలు, టాక్‌ షోలతో అలరిస్తోన్న తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఈ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. షో ప్రారంభం అయినప్పటినుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ షోలో ఇప్పటికీ అనేక సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు చెప్పి ప్రేక్షకులను అలరించారు. 

అయితే తాజాగా ఈ షో చివరి ఎపిసోడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తన గ్లామర్‌తో ఆకట్టుకోనున్నాడు. అన్‌స్టాపబుల్‌ మొదటి సీజన్‌ ఫినాలో ప్రీమియర్‌ షోగా ఈ ఎపిసోడ్‌ను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయనున్నారు మేకర్స్‌. ఇదివరకు 9 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షోలో లైగర్‌ మూవీ టీం, రానా, రవితేజ, పుష్ప చిత్రబృందం తదితర ప్రముఖ సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. అయితే మహేశ్‌ బాబు ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కూడా చేశాయి. బాలకృష్ణతో ఎపిసోడ్‌ మొత్తం సరదాగా గడించిందని మహేశ్‌ బాబు ఇన్‌స్టా వేదికగా కూడా తెలిపాడు. కానీ ఆ ఎపిసోడ్‌ను మాత్రం టెలీకాస్ట్‌ చేయలేదు. 

తాజాగా ఈ ఎపిసోడ్‌ను షో చివరి ఎపిసోడ్‌గా టెలికాస్ట్‌ చేయనున్నట్లు 'అన్‌స్టాపబుల్‌' మేకర్స్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. త్వరలో ప్రొమో కూడా రానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అత్యధిక వ్యూస్ సాధించిన ఈ షో మహేశ్‌ బాబు ఎపిసోడ్‌తో మరింత వ్యూస్‌ దక్కించికోనున్నట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement