Nandamuri Balakrishna: Reveals Secret About His Grandchildren In Unstoppable Special Episode Video Viral - Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: నాలాగా పబ్లిక్‌తో కలిసే ఆర్టిస్టే లేడు.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్‌

Feb 11 2022 11:02 AM | Updated on Feb 11 2022 12:01 PM

Balakrishna Reveals Secret About His Grandchildren In Unstoppable Special Episode - Sakshi

బాలయ్యతో ఓ స్పెషల్‌ వీడియో ప్లాన్‌ చేసింది ఆహా టీమ్‌. నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌ కాన్సెప్ట్‌ కింద కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో తన మనవళ్లు, మనవరాళ్లు తాతా అని పిలిస్తే ఒప్పుకోనన్నాడు. వాళ్లు తనని..

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే.. హోస్టింగ్‌లోనే కాదు నటసింహం నందమూరి బాలకృష్ణలోనూ కొత్త కోణాన్ని చూపించిందీ కార్యక్రమం. హీరోగా తెరమీద రఫ్ఫాడించే బాలయ్య హోస్టింగ్‌ను సైతం అదరగొట్టాడు. తన షోకు విచ్చేసిన అతిథులందరినీ కలుపుకుపోతూ ఎన్నో విషయాలు రాబడుతూ ఆడియన్స్‌నే ఆశ్చర్యపరిచాడు. ఆహాలో సూపర్‌ డూపర్‌ హిట్టయిన అన్‌స్టాపబుల్‌ విజయవంతంగా తొలి సీజన్‌ను పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఆహాలో అన్ని ఎపిసోడ్స్‌ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలయ్యతో ఓ స్పెషల్‌ వీడియో ప్లాన్‌ చేసింది ఆహా టీమ్‌. అందులో భాగంగా నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌ కాన్సెప్ట్‌ కింద కొన్ని ప్రశ్నలు అడగ్గా బాలయ్య దానికి సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో తన మనవళ్లు, మనవరాళ్లు తాతా అని పిలిస్తే ఒప్పుకోనన్నాడు. వాళ్లు తనని బాలా అని పిలవాలంతే, నో గ్రాండ్‌పా, నో తాతా అని చెప్పుకొచ్చాడు. పబ్లిక్‌లోకి వెళ్లి ఏమైనా చేయాలనుకుంటే ఆలోచించకుండా వెళ్లిపోతారా? అన్న ప్రశ్నకు నాలాగా పబ్లిక్‌తో కలిసే ఆర్టిస్ట్‌ ఎవరూ లేరని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement