న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక సంక్షోభం (2008–09) తర్వాత అత్యంత కనిష్టస్థాయిలో ఆర్థిక వృద్ధి ఈ ఏడాదిలోనే నమోదు కానుందని ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ’ (ఓఈసీడీ) తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి గతేడాది 3.6 శాతం నుంచి ఈ ఏడాది 2.9 శాతానికి పడిపోతుందని, 2020లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్‌లో 2019లో వృద్ధి రేటు 5.9 శాతంగా, 2020లో 6.3 శాతంగా ఉంటుందన్న అంచనాలకు వచ్చింది. 2018లో 6.8 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు అంతర్జాతీయ వృద్ధిని దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి నెట్టిందని అభివర్ణించింది.
Comments
Please login to add a commentAdd a comment