వాషింగ్టన్/ మాస్కో: ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. మొట్టమొదట ఎవరు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తారో వారే కోవిడ్–19 యుద్ధంలో విజేతగా నిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్ర రాజ్యాల మధ్య వ్యాక్సిన్ వార్‌కి తెరలేచింది. అమెరికా, కెనడా, బ్రిటన్ చేస్తున్న టీకా పరిశోధనలకు అడుగడుగునా రష్యా, చైనా అడ్డు తగులుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (24 గంటల్లో 2.6 లక్షల మందికి)
అగ్రదేశాల మ«ధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రష్యా ఇంటెలిజెన్స్‌కి చెందిన ఏపీటీ29, కాజీ బేర్ అనే సంస్థ టీకా సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్ చేసిందని అమెరికా, బ్రిటన్, కెనడాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలపై రష్యా ఎదురుదాడికి దిగింది. బ్రిటన్‌లో రష్యా రాయబారి ఆండ్రూ కెలిన్ ఈ ఆరోపణలు మతిలేనివని కొట్టి పారేశారు. ఒక దేశంలో జరిగే పరిశోధన ఫలితాల్ని, మరో దేశం సైబర్ దాడి ద్వారా తస్కరించడం అసాధ్యమని అన్నారు.(కరోనా వైరస్ లక్షణాలు రోజుకో రకంగా..)
అగ్రరాజ్యాల మధ్య అంతరాలు
చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచంలో అత్యధికంగా అమెరికాకే నష్టం జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య అంతరం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ దశకి వచ్చిన వ్యాక్సిన్‌లు 25 వరకు ఉంటే, అందులో అమెరికా ఫార్మా కంపెనీలు తొమ్మిదికి పైగా ఉన్నాయి. చైనాకు చెందిన కంపెనీలు నాలుగు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది.
వ్యాక్సిన్ రేసులో ఎలాగైనా ముందుకు వెళ్లి అధ్యక్ష ఎన్నికల్లో మార్కులు కొట్టేయాలని ట్రంప్ తహతహలాడుతుంటే మరోవైపు చైనా వ్యాక్సిన్ రేసులో విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యు సమాచారాన్ని విశ్లే షించి అందించడంలో చైనా ఉద్దేశపూర్వకంగానే రెండు వారాలు జాప్యం చేసిందన్న అనుమానాలు ఉన్నాయి. వ్యాక్సిన్ అంశంలో అమెరికా, బ్రిటన్, కెనడా ఒక జట్టుగా పని చేస్తూ చైనా, రష్యాపై ఆరోపణలు చేస్తూ ఉండడంతో వ్యాక్సిన్ వార్ మున్ముందు ఎలా ంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. (ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే)
ఆ శాస్త్రవేత్త హత్యతో లింక్ ఉందా ?
అమెరికాలో కరోనాటీకాపై పరిశోధనలు చేస్తున్న బింగ్ ల్యూ మేలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై ఎన్నో సందేహాలున్నాయి. చైనాలో పుట్టి పెరిగిన బింగ్ అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ కోవిడ్ వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేశారు. అవి కీలక దశకు చేరుకున్న సమయంలో ఆయన శవమై కనిపించారు. ఆయన హత్య వెనుక చైనా హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment