న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ అయిన టిక్‌టాక్‌ను భారత్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను ప్రమోట్ చేస్తున్న చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్.. భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2,000 పైచిలుకు ఉద్యోగులను తీసివేయనుంది. ఈ ఉద్యోగులకు మూడు నెలల వేతనంతోపాటు కంపెనీలో పనిచేసిన కాలాన్నిబట్టి మరో నెల పారితోషికం ఇవ్వనున్నారు. టిక్‌టాక్ గ్లోబల్ ఇంటెరిమ్ హెడ్ వనెస్సా పప్పాస్, గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ చండ్లీ సంయుక్తంగా భారత్‌లోని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్స్‌లో ఈ విషయాలను
వెల్లడించారు.
టిక్‌టాక్ శాశ్వతంగా బంద్
Published Thu, Jan 28 2021 5:28 AM | Last Updated on Thu, Jan 28 2021 11:37 AM
Comments
Please login to add a commentAdd a comment