![Temple Closed for 72 Years Know what was Seen When it Opened - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/17/pakistan.jpg.webp?itok=hXslqksp)
దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లోని హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాగే నాడు పాకిస్తాన్‌లో ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా కనిపించవు. కొన్ని దేవాలయాలను కూల్చివేయగా, మరికొన్నింటిని నిర్లక్ష్యం చేశారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదేవిధంగా పాకిస్తాన్‌లో కొన్ని దేవాలయాలు మూతపడ్డాయి. సియాల్‌కోట్‌లో 72 సంవత్సరాలుగా మూసివేసిన ఆలయం కొంతకాలం క్రితం తెరుచుకుంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆలయం ఎంత విశిష్టమైనదనేది దాని నిర్మాణశైలి తెలియజేస్తుంది. భారీ పరిమాణంలోని రాళ్లతో నిర్మితమైన ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇది చిన్నగా ఉన్న శివాలయమే అయినప్పటికీ, దీని నిర్మాణాన్ని ప్రముఖ దేవాలయాలతో పోలుస్తుంటారు. 75 ఏళ్లుగా ఆలయాన్ని మూసివేసినా, ఆలయ గోడలు చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. ఆలయాన్ని పరిశీలించి చూస్తే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించారో అంచనా వేయవచ్చు.
ఈ ఆలయాన్ని 72 ఏళ్ల తర్వాత 2019లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెరిచారు. ఈ దేవాలయం పేరు శివాల తేజ సింగ్ టెంపుల్. ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం ఆలయాన్ని తెరిచినప్పుడు అక్కడున్న హిందువులు హర్ హర్ మహాదేవ్ అని నినాదాలు చేశారు. ఈ నినాదాలు చాలా దూరం వరకూ ప్రతిధ్వనించాయని చెబుతారు.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment