చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అంతర్జాతీయంగా దాదాపు 209 దేశాలు, ప్రాంతాలకు వ్యాప్తించింది. ప్రపంచవ్యాప్తంగా 13,49,821 లక్షల మంది దీని బారిన పడగా.. 74,820 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా బాధితుల సంఖ్య అగ్రరాజ్యం అమెరికాలో అధికంగా ఉంది. అక్కడ 3,67,629 మందికి కరోనా సోకగా.. 10,981 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదైన దేశాల్లో స్పెయిన్ రెండో స్థానంలో, ఇటలీ ముడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు కరోనాపై పోరాటం చేస్తూ.. సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తున్నాయి. ఇక ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4600కు చేరింది. (కరోనాపై పోరాటం: సూపర్ స్టార్ల షార్ట్‌ఫిల్మ్)
ఈ వినాశనమంతా చైనా వల్లనే సంభవించిదని, ప్రారంభ దశలోనే వైరస్‌ను కట్టడి చేయలేకపోయిందని ప్రపంచ దేశాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #MakeChinaPay, #ChinaLiedPeopleDied అనే హ్యష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌లోనూ అధికంగానే ఉంది. వైరస్ వ్యాప్తికి కారణమైందన్న కోపంతో ఇప్పటికే అనేక మంది చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరిస్తున్నారు. అలాగే చైనా యాప్ టిక్‌టాక్‌ను కూడా తమ మొబైల్స్ నుంచి తొలిగించేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు #BoycottTikTok, #BoycottChineseProducts అంటూ చైనాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కరోనాను ‘చైనా వైరస్’ అని సంబోధించిన విషయం తెలిసిందే. (ఓ గాడ్! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?)
కాగా ‘చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం. భారత్ టిక్‌టాక్ వాడకాన్ని నిలిపివేస్తే చైనా దాదాపు రోజుకి 1 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతుందని, 250 మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోతారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. చైనా సంస్థ బైటెడెన్స్ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది. దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిక్‌టాక్ యూజర్లలో కనీసం సగం మంది ఇండియాకు చెందిన వారే. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారతీయులు రోజులో సగటున 52 నిమిషాలు పాటు టిక్‌టాక్‌లో గడుపుతున్నట్లు వెల్లడైంది. (కరోనాపై పోరు: ‘మీ మద్దతు కావాలి’)
Comments
Please login to add a commentAdd a comment