
ఇప్పటి వరకు ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించిన చైనా.. మరో కొత్త ఆవిష్కరణను తీసుకువచ్చింది. ఇందులో పట్టాలు లేని లేదా ట్రాక్‌లెస్ ట్రైన్స్ నగరం నడిబొడ్డున తిరగడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ వాడుతున్నాయి. పట్టాలు లేకుండా ట్రైన్ ఎలా వెళ్లగలుగుతుంది, దాని పూర్వాపరాలు ఏంటనే వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం.
రోడ్డుపై పరుగులు పెట్టే ఈ ట్రైన్ గంటకు 60 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది, ఒక్క సారికి 100మందిని తీసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ ట్రైన్ నగరంలో ప్రయాణించడం వల్ల సిటీ బస్సు మాదిరిగా ఎక్కువ మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుండం వల్ల జీరో ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంటే ఇది పూర్తిగా కాలుష్య రహితమైన ట్రైన్ అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్
ట్రాక్‌లెస్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ ట్రైన్.. వేగంగా ప్రయాణించడమే కాకుండా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ సిగ్నెల్ పడితే ఆగుతుంది కూడా. ఇది ఆటోమాటిక్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల రూట్ బాగా ఫాలో అవుతుంది. స్టీరింగ్ వీల్ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఆపరేట్ అవ్వడానికి ప్రత్యేకమైన సెన్సార్ సిస్టం కలిగి ఉంటుంది.
Trackless train in China ...pic.twitter.com/MsMrW4Wi26
— Figen (@TheFigen_) December 29, 2023