బీజింగ్ : ఓ ఇంట్లో చోరికి ప్రయత్నించిన దొంగ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని గ్రహించి ఆమెపై హత్యాచారానికి పూనుకున్నాడు. ఈ క్రమంలో మహిళ తెలివిగా ఆలోచించి అతని బారి నుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళ్లే.. చైనాకు చెందిన ఓ మహిళ ఇటీవలే వుహాన్ నుంచి జింగ్‌షాన్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. కాగా గత శుక్రవారం మహిళ ఉంటున్న ఇంట్లోకి ఓ వ్యక్తి దొంగతం చేయడానికి ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. (కరోనా వైరస్‌కు ‘వితిన్ డేస్’)
ఆ వ్యక్తి మహిళపై దాడి చేయబోతున్న సమయంలో సదురు మహళ తనకు వుహాన్‌లో ఉన్నప్పుడు కరోనా వైరస్ సోకిందని, ఈ వ్యాది నుంచి కాపాడుకోడానికి తనను తాను నిర్భంధించుకున్నానని అబద్దం చెప్పింది. అంతేగాక ఆ వ్యక్తిని నమ్మించేందుకు పదే పదే దగ్గుతున్నట్లు నటించింది. దీంతో భయాందోళనకు గురైన ఆ దొంగ ఆమెపై ఎలాంటి అఘాయిత్యం చేయకుండానే అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇంట్లోఉన్న 3,080 యువాన్లను ఎత్తుకెళ్లాడు. అనంతరం ఈ విషయంపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment