పారిస్ ఒలింపిక్స్ పతకాల వేటలో చైనా బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో చైనా బంగారు పతకం సాధించింది. చైనాకు చెందిన షూటర్లు హువాంగ్ యుటింగ్, షెంగ్ లియావో.. గోల్డ్ మెడల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఫైనల్లో రౌండ్‌లో యుటింగ్, షెంగ్ లియావో జోడీ.. 16-12 స్కోరుతో దక్షిణ కొరియా జంట కెయుమ్ జిహ్యోన్, పార్క్ హజున్‌లను ఓడించించి పతకాన్ని ముద్దాడింది.
ఈ క్రమంలో రెండో స్ధానంలో నిలిచిన కెయుమ్ జిహ్యోన్, పార్క్ హజున్, సిల్వర్ మెడల్.. మూడో స్ధానంతో సరిపెట్టుకున్న కజకస్తాన్‌కు చెందిన అలెగ్జాండ్రా లీ, ఇస్తామ్ సత్‌పయేవ్‌లకు కాంస్య పతకం దక్కాయి. మరోవైపు డైవింగ్‌లో కూడా చైనా స్వర్ణ పతకం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment