వాషింగ్టన్: కరోనా వైరస్ కట్టడికి తయారుచేస్తున్న వ్యాక్సిన్ పరిశోధనల్ని చైనా హ్యాకర్స్ దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని అమెరికాకు చెందిన సైబర్ నివేదికలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతటి విలువైన పరిశోధనల్ని తస్కరించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని తాము జరిపిన అధ్యయనంలో వెల్లడైందని యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. (కరోనా టీకా: త్వరలో మనుషులపై ప్రయోగం)
హ్యాకర్లుకు చైనా ప్రభుత్వంతో సంబంధం ఉందని, ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా వారు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. అతికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలిపారు. అయితే అమెరికా చేస్తున్న ఆరోపణల్ని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ఖండించారు. సైబర్ దాడులను చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు. కోవిడ్ చికిత్స విధానం, టీకా పరిశోధనల్లో ప్రపంచాన్ని చైనా నడిపిస్తుందని, ఎటువంటి ఆధారాలు లేకుండా వదంతులు సృష్టించడం అనైతికం అని జావో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment