ఆర్టిఫీషయల్ ఇంటలిజెన్స్... డిజిటల్ టార్చ్ రిలే టెక్నాలజీ... స్టేడియంలోనే ఉవ్వెత్తున ఎగసి ప్రేక్షకుల మీదికే దూసుకొచి్చనట్లు కనిపించిన అలలు... టపాకాయలు లేకుండానే అందరి చుట్టూ బాణాసంచా పేలినట్లుగా అనుభూతి... ఒక్కటేమిటి, ఇలా ప్రతీది అత్యుత్తమ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో కూడిన ప్రదర్శన... అనూహ్య రీతిలో, గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అంతా అచ్చెరువొందేలా ఆసియా క్రీడల ప్రారంభోత్సవం జరిగింది... సాంకేతికతను గొప్పగా వాడుకోవడంలో తమ ఘనత ఏమిటో ప్రపంచానికి చైనా మళ్లీ చూపించింది... ఆటలో అగ్రస్థానానికి గురి పెట్టిన ఆ దేశం అసలు సమరానికి ముందే అందరితే ఔరా అనిపించే ఉత్సవాన్ని ప్రదర్శించింది.
హాంగ్జౌ: క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన 19వ ఆసియా క్రీడలకు విజిల్ మోగింది. శనివారం జరిగిన వేడుకలతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ కార్యక్రమానికి హాజరై పోటీల ప్రారంభపు ప్రకటన చేశారు. 45 దేశాల నుంచి దాదాపు 12 వేలకు పైగా అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 80 వేల సామర్థ్యం గల ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా ఆరంభోత్సవం జరగ్గా... అదరగొట్టిన మెరుపు ప్రదర్శనలతో స్టేడియం దద్దరిల్లింది.
ఆసియా క్రీడల ఆరంత్సవ వేడుకలకు ‘టైడ్స్ సర్జింగ్ ఇన్ ఏషియా’ అనే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పోటీల వేదిక అయిన హాంగ్జౌ నగరం గుండా కియాన్‌టాంగ్ నది ప్రవహిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన అలలు వచ్చే నదిగా కియాన్‌టాంగ్‌కు గుర్తింపు ఉంది. అందుకే ఆసియాలో ఉధృత అలలు అనే తరహా థీమ్‌ను క్రీడలకు కలిపారు. 13 వేర్వేరు అంశాలు ప్రదర్శించగా అన్నింటా ఏదో ఒక చోట నీటి నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది.
►ఆసియా క్రీడల్లో నిర్వహిస్తున్న అన్ని రకాల క్రీడల గురించి ప్రత్యేక బ్యాంగ్‌ను ప్రదర్శించారు.
►ప్రాచీన చైనా నుంచి మొదలు ఆధునిక చైనా వరకు ఆ దేశ పురోగతి, ప్రస్థానం... ఇలా అన్ని అంశాలను కలుపుతూ చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. సంస్కృతి సాంప్రదాయాల గురించి చెబుతూనే కొత్త తరం సాంకేతికలో ఆ దేశం ముందంజ వేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. పోటీల ప్రారంభోత్సవ రోజైన సెపె్టంబర్ 23కు చైనా సౌర వ్యవస్థలో ప్రత్యేక చోటు ఉంది.
ఈ సీజన్ ఆ దేశంలో పంట సేకరణ (మన సంక్రాంతిలాంటిది) అతిథులను ఆహ్హనించే సమయం కూడా. అందుకే ఈ కార్యక్రమానికి ‘ఆటమ్ గ్లో’ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
►1990, 2010లలో కూడా ఆసియా క్రీడలు నిర్వహించిన చైనా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ... ఈసారి క్రీడలు జరుగుతున్న హాంగ్జౌ సమీపంలోనే మూడు హెరిటేజ్ నగరాల విశేషాలు చెబుతూ ‘మెమరీస్ ఆఫ్ జియాంగ్నాన్’ పేరుతో క్రీడల మూడు మస్కట్‌లు చెన్‌చెన్, కాంగ్‌కాంగ్, లియాన్ లియాన్ సందడి చేశాయి.
► ప్రారంభోత్సవ వేడుకల మార్చ్‌పాస్ట్‌లో అన్నింటికంటే ముందుగా అఫ్గానిస్తాన్, చివరగా ఆతిథ్య చైనా వచ్చాయి. అఫ్గానిస్తాన్ నుంచి రెండు జట్లు బరిలో ఉన్నాయి. ఒకటి మహిళలు లేకుండా ఆ దేశం పంపిన అధికారిక జట్టు కాగా... మరొకటి విదేశాల్లో తలదాచుకొని శిక్షణ తీసుకుంటూ బరిలోకి దిగిన బృందం. ఇందులో 17 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. మార్చ్‌పాస్ట్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘అవర్ ఏషియా’ పాటను వినిపించారు.
► భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ మన దేశపు జాతీయ పతాకంతో టీమ్ మార్చ్‌పాస్ట్‌కు నాయకత్వం వహించారు.
► చైనాకు చెందిన ముగ్గురు స్టార్లు ప్లేయర్లు, ఒలింపిక్ పతక విజేతలు యి షివెన్, ఫ్యాన్ జెండాంగ్, వాంగ్ జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీరంతా ఒకవైపు నిలబడగా... డిజిటల్ పద్ధతిలోనే టార్చ్‌ను వెలిగించారు. టార్చ్‌తో అథ్లెట్ పరుగెడుతూ వెళుతున్న లేజర్ షో ప్రేక్షకులకు కొత్త తరహా అను భూతిని పంచింది. చివర్లో బాణాసంచాను కూడా ఇదే తరహాలో పేల్చి క్రీడల ఆరం¿ోత్సవానికి ఘనమైన ముగింపునిచ్చారు.
చదవండి: నేడు ఆసీస్‌తో రెండో వన్డే: సిరీస్ విజయం లక్ష్యంగా భారత్
Comments
Please login to add a commentAdd a comment