ఇండియా-చైనా యుద్ధం వస్తే ఎవరికి నష్టం! | india china border dispute | Sakshi
Sakshi News home page

ఇండియా-చైనా యుద్ధం వస్తే ఎవరికి నష్టం!

Published Tue, Aug 1 2017 7:58 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

ఇండియా-చైనా యుద్ధం వస్తే ఎవరికి నష్టం!

ఇండియా-చైనా యుద్ధం వస్తే ఎవరికి నష్టం!

భారత్‌-చైనా సరిహద్దులోని సిక్కిం సెక్టర్లోని డోక్లామ్వివాదం ఫలితంగా రెండు ఆసియా దేశాల మధ్య యుద్ధమే వస్తే చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రపంచ జనాభాలో 35 శాతం(260 కోట్లు) నివసించే ఈ రెండు భారీ దేశాలూ ఓ చిన్నపాటి సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా? అన్నదే ప్రస్తుత ప్రశ్న. ఈశాన్య సరిహద్దులో భారత, చైనా సేనలు కేవలం 150 మీటర్ల ఎడంలో నిలబడి ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే మొదలైతే పోరు ఒక్క సిక్కిం సెక్టర్కే పరిమితం కాదనీ, అరుణాచల్నుంచి జమ్మూకశ్మీర్వరకూ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని నిపుణుల అంచనా.

1962లో మాదిరిగా పూర్తిస్థాయి యుద్ధమే జరిగితే చైనాకు ఎదురయ్యే అననుకూల పరిస్థితులు ఎక్కువ. చైనాకు 80 శాతానికి పైగా ముడి చమురు రవాణా జరిగే మలాకా జలసంధి(మలేసియా, ఇండొనేషియా మధ్య) అండమాన్దీవులకు సమీపంలో ఉన్న కారణంగా ఈ రవాణాపై యుద్ధం ప్రభావం పడుతుంది. అండమాన్నికోబార్దీవుల్లో భారత్కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది. పోరు సమయంలో చైనాకు ముడి చమురు నౌకల ప్రయాణం సాఫీగా సాగదు. ఇండియన్నేవీ చురుకుగా రంగంలోకి దిగితే, చైనా ఓడలు అండమాన్సముద్రం పక్క నుంచి పోవడం కష్టమే. భారత నేవీకున్న అతి పెద్ద స్థావరాల్లో ఇదొకటి. ఈ కారణంగానే 1999 కార్గిల్యుద్ధసమయంలో పాకిస్థాన్కు సాయం చేయడానికి చైనా ముందుకు రాలేదు.
 
పొరుగు దేశాలన్నిటితోనూ చైనాకు తగవులే!
చైనా చెప్పినట్టు డోక్లామ్వివాదం యుద్ధంగా మారితే, అది సిక్కిం సెక్టర్కే పరిమితం కాదనీ, భారత ఉత్తర సరిహద్దు యావత్తూ యుద్ధరంగమౌతుందని చైనా ఇటీవల హెచ్చరించింది. ఇదే నిజమైతే, చైనాపాకిస్థాన్ఆర్థిక కారిడార్ప్రాజెక్టులో భాగంగా పాక్ఆక్రమిత కశ్మీర్లో చైనా భారీగా పెట్టిన పెట్టుబడులు, ఆర్థిక, పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు భారత సేనల దాడులకు లక్ష్యంగా మారతాయి. అప్పుడు చైనా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే చైనా సర్కారు ఇక్కడ 4,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే, బర్మా రేవు చిట్టగాంగ్, మయన్నార్లోని కోకోస్కీలింగ్పోర్టులో చైనా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ. ఇంకా ఇటీవల శ్రీలంకలోని హంబంతోతట్‌ రేవు, పాక్లోని గ్వాదర్పోర్టులో చైనా కొన్ని సౌకర్యాలు పొందడానికి ఒప్పందాలు కూడా చేసుకుంది. ఆఫ్రికా ‘కొమ్ము’ దేశం జిబూటీలో చైనా సైనిక స్థావరం శరవేగంతో పూర్తిచేస్తోంది.

రెండు దేశాల మధ్య యుద్ధం ఆరంభమయ్యాక ఈ  ప్రాంతాలన్నీ భారత నౌకాదళ దాడుల పరిధిలోకి వస్తాయి. చైనాకు తన సరిహద్దుల్లోని 14 దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి. ఇప్పటివరకూ అదుపులో ఉన్న ఈ వివాదాలు ఒకసారి భారత్, చైనాల మధ్య పోరు మొదలైతే మళ్లీ వేడెక్కుతాయని అంచనా. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు కారణంగా అమెరికా, జపాన్సైతం ప్రత్యర్థులుగా మారాయి. భారత్తో యుద్ధంలో చైనా నేవీ నిమగ్నమైతే, దక్షిణ చైనా సముద్రంలో దాని పరిస్థితి బలహీనమౌతుందని రక్షణ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్కు చెందిన తెలుగువారి ఔషధాల కంపెనీ గ్లాండ్ఫార్మాలోని 86 శాతం మూలధనవాటాను కొనుగోలు చేయడానికి చైనా ఫార్మా దిగ్గజం ఫోసన్ఫార్మా చేసిన ప్రతిపాదనకు ఈ డోక్లామ్గొడవ కారణంగా తాజాగా కేంద్ర సర్కారు అనుమతివ్వలేదని వార్తలొస్తున్నాయి.
 
ఇండియాకూ ఇబ్బందులే!
ఆసియాలో చైనా, జపాన్తర్వాత మూడో పెద్ద ఆర్థికశక్తిగా అవతరించిన భారత్కు కూడా చైనాతో తలపడితే కష్టాలు తప్పవు. చైనా అధీనంలోని టిబెట్ఎత్తయిన పీఠభూమి కావడంతో అక్కడ నుంచి పోరాటం జరిపే చైనా సైనిక దళాలకు ఇండియాపై దాడులు సులువని అంచనా. అతి శీతల వాతావరణమున్న సరిహద్దుల్లో  భారత సాధారణ సైనిక దళాలు చాకచక్యంగా పోరుసాగించలేవనీ, అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్వంటి ప్రత్యేక దళాలపై ఎక్కువ ఆధారపడాల్పి ఉంటుందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అదీగాక చైనాను ఆనుకుని ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఇంకా పూర్తికాకపోవడం కూడా ఇండియాకు యుద్ధకాలంలో ఇబ్బంది కలిగించే అంశమే. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement