india-chaina war
-
మంచుకొండల్లో మహాముప్పు.. తక్షణం అడ్డుకట్ట వేయకుంటే విధ్వంసమే
అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి. దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు. సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్‌లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్‌పోస్టులు, హెలిప్యాడ్లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఎల్ఏసీ వెంట అధిక ముప్పు.. భారత్, చైనా మధ్య 3,500 కి.మీ. పొడవునున్న వాస్తవాధీన రేఖ వెంబడి ముప్పు అధికంగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్‌హెచ్–7 జాతీయ రహదారిపై ప్రతీ కిలోమీటర్‌కి ఒక కొండచరియ విరిగిపడి రహదారులు మూతపడడం సర్వసాధారణంగా మారింది. ‘‘భారత్‌లోని హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లోనూ, అటు చైనా వైపు హిమాలయాల్లోనూ అత్యధిక ముప్పు పొంచి ఉంది. మౌలిక సదుపాయాల పేరిట చేపడుతున్న కార్యక్రమాలు శాశ్వత మంచు పర్వతాలను సైతం కుదేలు చేసే రోజులొచ్చేస్తున్నాయి. అవలాంచ్‌లు (హిమ ఉత్పాతం), కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు అత్యంత సాధారణంగా మారతాయి’’అని క్రయోస్ఫియర్ జర్నల్ ఒక నివేదికలో వెల్లడించింది. చైనా నిర్మాణాలు టిబెట్ పీఠభూమిలో ► 9,400 కి.మీ. మేరకు రోడ్డు నిర్మాణం. ళీ 580 కి.మీ. పొడవున రైల్వేలు చెంగ్డూ నుంచి లాసా వరకు రైల్వే నిర్మాణం ► సముద్రానికి 13 వేల అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతి పెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్–టిబెట్ రైల్వే లైన్ నిర్మాణం ► 2,600 కి.మీ. పొడవున విద్యుత్ లైన్లు ళీ వేలాది సంఖ్యలో భవనాలు ► అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఉత్తర చైనాకు నీటిని మళ్లించడానికి డ్యామ్‌లు ► 2050 నాటికి మంచుకొండల్లో 38.14%రోడ్లు, 38.76% రైల్వేలు ► 39.41% విద్యుత్ లైన్లు, 20.94% భవనాలే కనిపిస్తాయి. ► సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం 624 భవనాల నిర్మాణం నేపాల్ వైపు ► చైనా బెల్డ్ అండ్ ఓడ్ ఇనీషియేటివ్ కింద రాసువగాఢి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ► ఉద్యాన వనాలు ► హైడ్రోపవర్ ప్రాజెక్టులు ► 240 కోట్ల డాలర్ల విలు వైన ప్రాజెక్టులు ► పాంగాంగ్ సరస్సుపై సైనిక అవసరాల కోసం వంతెన భారత్ నిర్మాణాలు ► హిమాలయాల్లో 30 అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ► అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిమ్‌లలో వాయువేగంతో సాగుతున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాలు ► 900 కి.మీ. పొడవునా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్లను కలిపేలా చార్ధామ్ ప్రాజెక్టు ► 283 కి.మీ. పొడవునా నిమ్ము–పదమ్–దర్చా (ఎన్పీడీ)హైవే ► చైనాతో వివాదంలో ఉన్న 3,500 కి.మీ. సరిహద్దుల పొడవునా రోడ్లు, టన్నెల్స్, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్స్, హెలిప్యాడ్స్ నిర్మాణం ► చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? ► అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాల్లో వర్షాకాలాలు బీభత్సంగా మారనున్నాయి. ► సింధు నదికి సమీపంలో చిలాస్‌లో డ్యామ్‌లు కట్టడంతో ఒక నెలలో దాని పరిసర ప్రాంతంలో 300 సార్లు భూకంపం సంభవించింది. ► సరిగ్గా అలాంటి ముప్పే హిమాలయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ► అవలాంచ్‌లు ముంచెత్తి సరస్సులు విస్ఫోటనం చెందుతాయి ► కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదముంది. టిబెట్‌లోని బొమి ప్రాంతంలో దశాబ్దాల క్రితం కట్టిన వంతెనలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. ► ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవకుండానే భూకంపాలు, కొండచరియలు, అలవాంచ్లతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని, మరింత ప్రమాదంలోకి హిమాలయాలు వెళ్లిపోయాయని ఓల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూస్ కాబ్ అంచనా వేస్తున్నారు. ► భారత్‌లో 23 హిమానీనదాలతో అత్యంత ప్రమాదముందని నిపుణులు గుర్తించారు. ► భారత్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాల్లో 85% హిమాలయాల్లోనే సంభవిస్తున్నాయి. కొండచరియలు ముప్పు కలిగిన టాప్–5 దేశాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి. ► హిమాలయాల్లో ఉన్న హిమానీ నదాలు 2035 నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధాలు అధికారానికి సోపానాలా?
ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్‌పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్ పాకిస్తాన్‌తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలం భారీగా పెరిగింది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మూడో భారత్–పాక్ యుద్ధం(1971) బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది. మొదటి భారత్–పాక్ యుద్ధం(1947) కశ్మీర్ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్– 1948 డిసెంబర్ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారత్–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్ 20 నుంచి 1962 నవంబర్ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 361 సీట్లు సాధించింది. ఐపీకేఎఫ్ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్‌ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రెండో భారత్–పాక్ యుద్ధం(1965) లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి. కార్గిల్ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్‌దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
ఇండియా-చైనా యుద్ధం వస్తే ఎవరికి నష్టం!
భారత్-చైనా సరిహద్దులోని సిక్కిం సెక్టర్లోని డోక్లామ్వివాదం ఫలితంగా రెండు ఆసియా దేశాల మధ్య యుద్ధమే వస్తే చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రపంచ జనాభాలో 35 శాతం(260 కోట్లు) నివసించే ఈ రెండు భారీ దేశాలూ ఓ చిన్నపాటి సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా? అన్నదే ప్రస్తుత ప్రశ్న. ఈశాన్య సరిహద్దులో భారత, చైనా సేనలు కేవలం 150 మీటర్ల ఎడంలో నిలబడి ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే మొదలైతే పోరు ఒక్క సిక్కిం సెక్టర్కే పరిమితం కాదనీ, అరుణాచల్నుంచి జమ్మూకశ్మీర్వరకూ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని నిపుణుల అంచనా. 1962లో మాదిరిగా పూర్తిస్థాయి యుద్ధమే జరిగితే చైనాకు ఎదురయ్యే అననుకూల పరిస్థితులు ఎక్కువ. చైనాకు 80 శాతానికి పైగా ముడి చమురు రవాణా జరిగే మలాకా జలసంధి(మలేసియా, ఇండొనేషియా మధ్య) అండమాన్దీవులకు సమీపంలో ఉన్న కారణంగా ఈ రవాణాపై యుద్ధం ప్రభావం పడుతుంది. అండమాన్నికోబార్దీవుల్లో భారత్‌కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది. పోరు సమయంలో చైనాకు ముడి చమురు నౌకల ప్రయాణం సాఫీగా సాగదు. ఇండియన్నేవీ చురుకుగా రంగంలోకి దిగితే, చైనా ఓడలు అండమాన్సముద్రం పక్క నుంచి పోవడం కష్టమే. భారత నేవీకున్న అతి పెద్ద స్థావరాల్లో ఇదొకటి. ఈ కారణంగానే 1999 కార్గిల్యుద్ధసమయంలో పాకిస్థాన్‌కు సాయం చేయడానికి చైనా ముందుకు రాలేదు. పొరుగు దేశాలన్నిటితోనూ చైనాకు తగవులే! చైనా చెప్పినట్టు డోక్లామ్వివాదం యుద్ధంగా మారితే, అది సిక్కిం సెక్టర్కే పరిమితం కాదనీ, భారత ఉత్తర సరిహద్దు యావత్తూ యుద్ధరంగమౌతుందని చైనా ఇటీవల హెచ్చరించింది. ఇదే నిజమైతే, చైనాపాకిస్థాన్ఆర్థిక కారిడార్ప్రాజెక్టులో భాగంగా పాక్ఆక్రమిత కశ్మీర్లో చైనా భారీగా పెట్టిన పెట్టుబడులు, ఆర్థిక, పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు భారత సేనల దాడులకు లక్ష్యంగా మారతాయి. అప్పుడు చైనా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే చైనా సర్కారు ఇక్కడ 4,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే, బర్మా రేవు చిట్టగాంగ్, మయన్నార్లోని కోకోస్కీలింగ్పోర్టులో చైనా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ. ఇంకా ఇటీవల శ్రీలంకలోని హంబంతోతట్ రేవు, పాక్‌లోని గ్వాదర్పోర్టులో చైనా కొన్ని సౌకర్యాలు పొందడానికి ఒప్పందాలు కూడా చేసుకుంది. ఆఫ్రికా ‘కొమ్ము’ దేశం జిబూటీలో చైనా సైనిక స్థావరం శరవేగంతో పూర్తిచేస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆరంభమయ్యాక ఈ ప్రాంతాలన్నీ భారత నౌకాదళ దాడుల పరిధిలోకి వస్తాయి. చైనాకు తన సరిహద్దుల్లోని 14 దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి. ఇప్పటివరకూ అదుపులో ఉన్న ఈ వివాదాలు ఒకసారి భారత్, చైనాల మధ్య పోరు మొదలైతే మళ్లీ వేడెక్కుతాయని అంచనా. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు కారణంగా అమెరికా, జపాన్సైతం ప్రత్యర్థులుగా మారాయి. భారత్‌తో యుద్ధంలో చైనా నేవీ నిమగ్నమైతే, దక్షిణ చైనా సముద్రంలో దాని పరిస్థితి బలహీనమౌతుందని రక్షణ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన తెలుగువారి ఔషధాల కంపెనీ గ్లాండ్ఫార్మాలోని 86 శాతం మూలధనవాటాను కొనుగోలు చేయడానికి చైనా ఫార్మా దిగ్గజం ఫోసన్ఫార్మా చేసిన ప్రతిపాదనకు ఈ డోక్లామ్గొడవ కారణంగా తాజాగా కేంద్ర సర్కారు అనుమతివ్వలేదని వార్తలొస్తున్నాయి. ఇండియాకూ ఇబ్బందులే! ఆసియాలో చైనా, జపాన్తర్వాత మూడో పెద్ద ఆర్థికశక్తిగా అవతరించిన భారత్‌కు కూడా చైనాతో తలపడితే కష్టాలు తప్పవు. చైనా అధీనంలోని టిబెట్ఎత్తయిన పీఠభూమి కావడంతో అక్కడ నుంచి పోరాటం జరిపే చైనా సైనిక దళాలకు ఇండియాపై దాడులు సులువని అంచనా. అతి శీతల వాతావరణమున్న సరిహద్దుల్లో భారత సాధారణ సైనిక దళాలు చాకచక్యంగా పోరుసాగించలేవనీ, అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్వంటి ప్రత్యేక దళాలపై ఎక్కువ ఆధారపడాల్పి ఉంటుందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అదీగాక చైనాను ఆనుకుని ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఇంకా పూర్తికాకపోవడం కూడా ఇండియాకు యుద్ధకాలంలో ఇబ్బంది కలిగించే అంశమే.